
కనులపండువగా జగన్నాథుని రథయాత్ర
మంగళ వాయిద్యాలు, భక్తుల జయజయ ధ్వానాలు, భజనల నడుమ వీరఘట్టంలో జగన్నాథుని రథయాత్ర శుక్రవారం వైభవంగా సాగింది. తొలుత యజ్ఞకర్త ఎస్.వి.ఎల్.ఎన్ శర్మయాజీ దంపతులు, అర్చకుడు లింగరాజ్‌రథో స్వామి వారికి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం రథంపై సుభద్ర, బలభద్ర సమేత జగన్నాథస్వామి ఉత్సవ విగ్రహాలను ఉంచి యాత్రను ప్రారంభించారు. పట్టణ వీధుల్లో రథంపై వస్తున్న స్వామివారిని చూసి భక్తులు తన్మయత్వం చెందారు. భక్తి శ్రద్ధలతో పూజలు జరిపారు. దేవదాయశాఖ ఈఓ సూర్యనారాయణ యాత్రను పర్యవేక్షించారు. – వీరఘట్టం