
అంధకారంలో అవస్థలు
చిత్రంలో చిమ్మచీకటిలో ఆరుబయట కూర్చున్నవారంతా నిండు గర్భిణులు. డెలివరీ సమయం దగ్గర పడడంతో గిరిశిఖర గ్రామాల నుంచి గుమ్మలక్ష్మీపురంలోని యూత్ ట్రైనింగ్ సెంటర్ (వైటీసీ)లో నిర్వహిస్తున్న గర్భిణుల వసతి గృహంలో చేరారు. భారీ వర్షం కారణంగా గురువారం రాత్రి నుంచి శుక్రవారం రాత్రి 9 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో అంధకారంలోనే గడిపారు. ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరయ్యారు. రాత్రంతా ఆరుబయటే జాగారం చేయాల్సిన పరిస్థితి. వైటీసీ సిబ్బంది సమాచారంతో విద్యుత్ సరఫరా పనులను సంబంధిత సిబ్బంది చేపట్టారు. అయితే, ట్రాన్స్‌ఫార్మర్ నుంచి వైటీసీకి సరఫరా అయ్యే విద్యుత్ తీగెలు అండర్ గ్రౌండ్‌లో ఉండడంతో సరఫరాను పునరుద్ధరించలేకపోయారు. శుక్రవారం రాత్రి 9 గంటలకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడంతో గర్భిణులు ఊపిరిపీల్చుకున్నారు. వైటీసీకి జనరేటర్ సదుపాయం కల్పించాలని ప్రభుత్వానికి గర్భిణుల బంధువులు విజ్ఞప్తిచేశారు. – గుమ్మలక్ష్మీపురం