
గిరిజనులపై చిన్నచూపెందుకో?
గిరిజనులకు అది చేస్తున్నాం... ఇది చేస్తున్నామంటూ కూటమి ప్రభుత్వం ప్రచారానికే పరిమితం అవుతుందేతప్ప ఇప్పటికే పేరుకుపోయిన సమస్యలపై దృష్టిసారించి పరిష్కార దిశగా చర్యలు తీసుకోవడం లేదు. ముల క్కాయవలస పాఠశాల వంటివి జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల ఉన్నాయి. విద్యాశాఖాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. సమస్యల పరిష్కారంవైపు అధికారులతో పాటు పాలకులు కూడా కన్నెత్తి చూడడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య ఎలా అందుతుందో అధికారులే సమాధానం చెప్పాలి. తక్షణమే పునాదుల దశలో ఉన్న పాఠశాల భవనాన్ని పూర్తిచేయాలి.
– బి.రవికుమార్, అఖిల భారత విద్యార్థి సమైక్య నాయకుడు, పార్వతీపురం