
‘మత్తు’ జోలికి వెళ్లొద్దు
విజయనగరం క్రైమ్: మత్తుపదార్థాల జోలికి వెళ్లవద్దని స్థానిక టాస్క్‌ఫోర్స్ సీఐ బంగారు పాప సూచించారు. నగర పరిధిలోని కస్పా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని విద్యార్థులకు మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్ప్రభావాలపై శుక్రవారం అవగాహన కల్పించారు. గంజాయి, ఖైనీ, గుట్కా, మద్యం, సిగరెట్ వంటి మత్తు పదార్థాలకు బానిసలై ఎంతో మంది యువత తమ బంగారు భవిష్యత్ నాశనం చేసుకుంటున్నారని, కన్నవారికి తీరని శోకం మిగుల్చుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిఒక్కరూ మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, మంచి అలవాట్లు అలవర్చుకోవాలని తెలిపారు.