
సోమవారం శ్రీ 23 శ్రీ జూన్ శ్రీ 2025
పార్వతీపురం టౌన్: కూటమి నేతలు గత ఎన్నికల్లో నిరుద్యోగులు, విద్యార్థులకు అనేక హామీలిచ్చి గెలిచాక వెన్నుపోటు పొడిచారని యువత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఎం చంద్రబాబునాయుడు ఏడాదిగా విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించకుండా నాటకాలు ఆడుతున్నారని మండిపడుతున్నారు. ఉద్యోగాలు, ఉపాధి కోసం యువత ఎదురు చూస్తుంది. జాబ్ క్యాలెండర్‌పై గంపెడాశలు పెట్టుకున్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు ఇంటికో ఉద్యోగం వచ్చేంత వరకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా నిరుద్యోగ భృతి గురించి మాట్లాడటం లేదని, ఎప్పటి నుంచి ఇస్తారో స్పష్టంగా చెప్పాలని పార్వతీపురం మన్యం జిల్లాలో గల సుమారు 1.49 లక్షల కుటుంబాల్లోని యువత డిమాండ్ చేస్తోంది. నిరుద్యోగులకు 20లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ఉద్యోగాలు ఇవ్వలేదు సరికదా ఉన్న ఉద్యోగాలను ఊడదీస్తూ నిరుద్యోగులను నిలువునా మోసం చేస్తున్నారు. అధికారంలోకి వస్తే నెలకు రూ.3,000 నిరుద్యోగ భృతి ఇస్తామని నమ్మించి ఇవ్వకుండా ఎగనామం పెట్టారు. ఈ క్రమంలో యువతకు మద్దతుగా నేడు జిల్లా కేంద్రంలో వైఎస్సార్‌సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో యువత పోరు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఏం చేశారు..
14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసి, మరోసారి అధికారంలోకి వచ్చిన ఈయన పాలనలో ఉద్యోగాల భర్తీ అనేది కనిపించదు. 2009 ఎన్నికల్లో లక్షల్లో ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి అని హామీలు గుప్పిస్తే ప్రజలు విశ్వసించలేదు. రాష్ట్ర విభజన సమయంలో 2014లో 600కు పైగా ఇచ్చిన హామీల్లో నిరుద్యోగ భృతిని చేర్చి అధికారంలోకి వచ్చారు. కానీ, ఐదేళ్లు అధికారం అనుభవించి ఎన్నికల దగ్గరకు వచ్చే సరికి యువ నేస్తం అంటూ మభ్యపెట్టారు. తాజాగా 2024లోనూ నిరుద్యోగ పల్లవి అందుకుని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అండ్ కో అసలు ఉద్యోగాల ఊసే ఎత్తకపోవడం గమనార్హం.
ఆందోళనలో యువత
కూటమి ప్రభుత్వంలో యువత ఆందోళనలతో ఉన్నారు. నిరుద్యోగ భృతిపై కూటమి ప్రభుత్వం స్పష్టత ఇవ్వటం లేదు. యువతకు ఉద్యోగాలు లేవు. ఎన్నికల్లొ ఇచ్చిన హామీల్లొ భాగంగా ఇంటికో ఉద్యోగం ఇవ్వాలి. యువగళంలో లోకేష్ లక్షల్లో ఉద్యోగాలు ఇస్తారని హామీ నిచ్చారు. నిరుద్యోగ భృతిపై ప్రస్తావన లేదు. ఉద్యోగాలు ఇస్తారన్ని నమ్మకం లేదు.
– ముగడ జగన్‌మోహన్‌రావు, వైఎస్సార్‌సీపీ స్టేట్ యూత్ జనరల్ సెక్రటరీ, పార్వతీపురం
యువతను మోసం చేసిన ఘనత చంద్రబాబుదే...
నిరుద్యోగులకు 20లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ఉద్యోగాలు ఇవ్వలేదు సరికదా ఉన్న ఉద్యోగాలు ఊడపీకుతూ నిరుద్యోగులను నిలువునా ముంచారు. అధికారంలోకి వస్తే నెలకు రూ.3,000 నిరుద్యోగ భృతి ఇస్తామని నమ్మించి ఇవ్వకుండా ఎగనామం పెట్టారు. ఈ కూటమి ప్రభుత్వం గత ఏడాది కాలంగా విద్యార్థులను, యువతను మోసం చేస్తున్న వైనాన్ని నిలదీస్తున్నాం. తక్షణమే కూటమి ప్రభుత్వం హామీలను అమలు చేయాలని కోరుతూ వైఎస్‌ఆర్ సీపీ యూత్ ఆధ్వర్యంలో యువత పోరు కార్యక్రమం నిర్వహిస్తున్నాం.
– అలజంగి జోగారావు,
మాజీ ఎమ్మెల్యే, పార్వతీపురం
యువతను నట్టేట ముంచారు..
కూటమి ప్రభుత్వం నిరుద్యోగ యువతను నట్టేట ముంచింది. గతంలో మాదిరి నిరుద్యోగులను మోసం చేయకుండా అందరికీ నిరుద్యోగ భృతి ఇవ్వాల్సిందే. ఉద్యోగాలు కల్పించే వరకు ఆర్థిక సాయంగా భృతి ఇస్తే నిరుద్యోగులకు, వారి కుటుంబాలకు ఎంతో తోడ్పాటు ఇచ్చినట్టు అవుతుంది. యువతను ఆదుకునేంత వరకు వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుంది.
– నంగిరెడ్డి శరత్‌బాబు,
వైఎస్సార్‌సీపీ యువజన విభాగం
జిల్లా అధ్యక్షుడు
నిరుద్యోగుల ప్రస్తావనే లేదు
ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడుస్తున్నా నిరుద్యోగుల ప్రస్తావన లేదు. నిరుద్యోగ భృతి హామీ అయితే ఇచ్చారు గానీ అమలుపై ఆసక్తి చూపడంలేదు. అసలు నిరుద్యోగ భృతి అమలు చేసే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి ఉందా? లేకుంటే ఎప్పటిలానే యూటర్న్ తీసుకుంటారా? యువతకు అండగా వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నేడు జిల్లా కేంద్రంలో నిరసన తెలుపుతున్నాం.
– పల్లా అనంతనాయుడు,
వైఎస్సార్‌సీపీ కురుపాం నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు
న్యూస్‌రీల్
మేనిఫెస్టోలో..
ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన తమ ఉమ్మడి మేనిఫెస్టో సూపర్ సిక్స్‌లో నిరుద్యోగులకు పెద్ద పీట వేస్తున్నట్టు ప్రకటించారు. నిరుద్యోగులందరికీ ఉద్యోగాల కల్పనతో పాటు ఉద్యోగం వచ్చేంత వరకు ప్రతి ఒక్కరికీ నెలకు రూ.3 వేల భృతి ఇస్తామంటూ ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టారు. కానీ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది దాటినప్పటికీ ఆ ఊసే ఎత్తట్లేదు. ప్రభుత్వం ఈ హామీని అమలు చేయడంలో జాప్యం చేస్తుండటంతో నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రూ.3వేల నిరుద్యోగ భృతి ఊసే లేదు..
జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతిపై ఆందోళన
ఇంటికో ఉద్యోగం అని మోసం చేశారు..
నేటి యువత పోరుకు వైఎస్సార్‌సీపీ మద్దతు
కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన

సోమవారం శ్రీ 23 శ్రీ జూన్ శ్రీ 2025

సోమవారం శ్రీ 23 శ్రీ జూన్ శ్రీ 2025

సోమవారం శ్రీ 23 శ్రీ జూన్ శ్రీ 2025

సోమవారం శ్రీ 23 శ్రీ జూన్ శ్రీ 2025

సోమవారం శ్రీ 23 శ్రీ జూన్ శ్రీ 2025