ఈఎస్‌ఐ డయోగ్నోస్టిక్ సెంటర్‌లో బదిలీలు
విజయనగరం ఫోర్ట్: ఈఎస్‌ఐ డయోగ్నోస్టిక్ సెంటర్‌లో పనిచేస్తున్న పలువురు వైద్యులకు బదిలీఅయింది. కె.నీరజ (జనరల్ మెడిసిన్ విభాగం)కు మల్కాపురం ఈఎస్‌ఐ ఆస్పత్రికి బదిలీకాగా, ఆమె స్థానంలో డాక్టర్ కిరణ్‌కుమార్ రాజమండ్రి నుంచి వస్తున్నారు. పి.భాస్కరరావు (జనరల్ సర్జన్)కు తిరుపతి, భవిత ( గైనికాలజీ)కు రాజమండ్రి బదిలీ అయింది. వీరి స్థానంలో ఉమావాణి, ఏవీఎస్ కృష్ణారావు మల్కాపురం ఈఎస్‌ఐ ఆస్పత్రి నుంచి వస్తున్నారు. డాక్టర్ శ్రీవాణికి కూర్మన్న పాలేం ఈఎస్‌ఐ డిస్పెన్సరీకి బదిలీ కాగా, ఆమె స్థానంలో విశాఖపట్నం గురుద్వారా ఈఎస్‌ఐ డిస్పన్సరీ నుంచి డాక్టర్ మాధురిదేవి వస్తున్నారు. డాక్టర్ శిశరామకృష్ణకు విశాఖపట్నం జిల్లా అచ్చుతాపురం ఈఎస్‌ఐ డిస్పెన్సరీ నుంచి విజయనగరం ఈఎస్‌ఐ డయోగ్నోస్టిక్ సెంటర్‌కు వస్తున్నారు.
వైద్య ఆరోగ్యశాఖలో బదిలీలు..
వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న పలువురు ఉద్యోగులకు బదిలీ అయింది. డీపీహెచ్‌ఎన్‌ఓ మామిడి సత్యవతి, డీఎస్‌ఓ ధర్మారావుకు విశాఖపట్నంకు బదిలీ అయింది. సీనియర్ అసిస్టెంట్ రాజుకు విశాఖపట్నం ప్రాంతీయ ఐ ఆస్పత్రికి బదిలీ అయింది.


