సత్య డిగ్రీ కళాశాల క్యాంపస్ డ్రైవ్‌లో 197 మందికి ఉద్యో
● యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని లిమ్కాబుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్, ప్రముఖ చిత్రకారిణి సిరిపురపు ప్రవల్లికా నారాయణ్ వేసిన చిత్రం అందరినీ ఆకట్టుకుంటోంది. యోగాతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని, వివిధ యోగాసనాలతో ఇంటర్నేషనల్ యోగాడే అని వేసిన చిత్రం అబ్బురపరుస్తోంది. విజయనగరం టౌన్
విజయనగరం అర్బన్: పట్టణంలోని సత్య డిగ్రీ/పీజీ కళాశాల ప్రాంగణంలో లెర్నింగ్ ట్రీ ఆర్గనైజేషన్, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ సంయుక్తంగా శుక్రవారం నిర్వహించిన క్యాంపస్ డ్రైవ్‌లో 197 మందికి ఉద్యోగాలు లభించాయి. ఈ మేరకు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సాయిదేవమణి శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. డ్రైవ్‌లో 16 కంపెనీలు పాల్గొని 492 మంది అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేసినట్లు తెలిపారు. తొలుత రిటన్ టెస్ట్, తరువాత టెక్నికల్ రౌండ్, ఇంటర్వ్యూలు నిర్వహించగా ప్రతిభ చూపిన 197 మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారన్నారు. ఉద్యోగాలకు ఎంపికై న విద్యార్థులను కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం.శశిభూషణరావు అభినందించారు.
సత్య డిగ్రీ కళాశాల క్యాంపస్ డ్రైవ్‌లో 197 మందికి ఉద్యో


