జాడ లేని సంక్షేమం..! | - | Sakshi
Sakshi News home page

జాడ లేని సంక్షేమం..!

May 23 2025 2:29 AM | Updated on May 23 2025 2:29 AM

జాడ ల

జాడ లేని సంక్షేమం..!

ఆదుకునే పథకాలేవీ?

రోజూ ఉదయాన్నే విజయనగరం గణేష్‌ గుడి మీదకు పని కోసం వస్తాను. వారంలో మూడు రోజులు పని దొరకడం చాలా కష్టంగా ఉంటోంది. గతంలో ఈ పరిస్థితులు లేవు. పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో జీవనం సాగిస్తున్నాం. ముఖ్యంగా పిల్లల చదువులు భారంగా మారాయి. గతంలో అమ్మ ఒడి, వసతి దీవెన కింద సాయం అందేది. ఇప్పుడు ఆదుకునే ఆ పథకాలు కూడా లేకుండా పోయాయి.

– సత్యం, తాపీ మేసీ్త్ర, విజయనగరం

ఆగిన ఇళ్ల నిర్మాణం

గత ప్రభుత్వం మా ఊర్లో పేదల ఇళ్ల నిర్మాణం కోసం పెద్ద ఎత్తున లేఅవుట్లు ఏర్పాటు చేసింది. వాటిలో వేలల్లో ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. దీంతో బయటకు ఎక్కడికి వెళ్లే పని లేకుండా ఊర్లోనే పనులు ఉండేవి. ఈ ప్రభుత్వం వచ్చాక కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు నిలిచిపోయాయి. పెయింటింగ్‌, ఉడ్‌వర్క్స్‌, ట్రాన్స్‌పోర్ట్‌ రంగ కార్మికులపై ఈ ప్రభావం పడుతోంది. వారాలు, నెలల తరబడి ఇంటి పట్టునే ఉంటే మా కుటుంబాలు ఎలా గడుస్తాయి?

–కృష్ణ అప్పారావు,

పెయింటర్‌, విజయనగరం

కార్మికుల పొట్ట కొట్టారు..

కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది కావస్తున్న పైసా కూడా ఇవ్వలేదు. కార్మికులకు తీరని అన్యాయం చేసింది. విజయనగరం జిల్లా పరిధిలో చాలా మంది కార్మికులకు గుర్తింపు ఇవ్వలేదు. ఈ ఏడాదిలో ఒక్క క్లెయిమ్‌ చెల్లించలేదు. ప్రభుత్వం ఏమాత్రం సాయం చేయడం లేదు. భవన నిర్మాణ రంగాన్ని నిర్లక్ష్యం చేసింది.

–బి.రమణ

జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం కార్యదర్శి

కార్మిక బోర్డును తక్షణమే

పునరుద్ధరించాలి

ఎన్ని ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన భవన నిర్మాణ కార్మికులకు ప్రయోజనం లేకుండా పోయింది. ఇసుకఽ కొరత లేకపోయినా పనుల్లేకుండా పోయాయి. భవన కార్మికుల సంక్షేమ బోర్డును రద్దును పునరుద్ధిరస్తానన్న కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఆ ఊసే లేదు. కూటమి ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలి.

–మజ్జి ఆదినారాయణ,

భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు

అర్థాకలితో నిర్మాణ రంగ కార్మికులు

ఉమ్మడి జిల్లాలో నిలిచిపోయిన 1590 క్లెయిమ్స్‌

కార్మికుల సంక్షేమం పట్టని కూటమి ప్రభుత్వం

ఎన్నికల నాటి హామీలు ఏమయ్యాయి?

విజయనగరం గంటస్తంభం: రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం భవన నిర్మాణ రంగ కార్మికుల పొట్టకొట్టింది. కార్మికుల సంక్షేమ బోర్డులోని నిధులను దారి మళ్లించారు. కనీసం మరణ క్లెయిమ్స్‌, ప్రసూతి క్లెయిమ్స్‌, స్కాలర్‌షిప్‌ క్లెయిమ్స్‌, అనారోగ్య క్లెయిమ్స్‌ కూడా అందకుండా చేశారు. ఫలితంగా ఉమ్మడి విజయనగరం జిల్లాలోని సుమారు 1590 క్లెయిమ్స్‌ ఇప్పుడు వరకు అపరిష్కృతంగానే ఉన్నాయి. భవన నిర్మాణ, ఇతర అసంఘటిత రంగ కార్మికులు, కూలీల జీవితాలు కొద్ది నెలలుగా దుర్భరంగా మారాయి. అరకొర పనులు, అప్పుల బాధలు, కష్టాల సుడిగుండాల్లో చిక్కుకుని కొట్టుమిట్టాడుతున్నారు. పిల్లల చదువులు, ఇంటి అద్దెలు, ఇతర ఖర్చులకు సైతం డబ్బు పుట్టక బతుకు భారంగా ఈడుస్తున్నారు. సూపర్‌ సిక్స్‌, సెవెన్‌ అంటూ అలవిగాని హామీల వర్షం కురిపించి గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వం కార్మికుల సంక్షేమాన్ని పూర్తిగా గాలికి వదిలేసింది.

కొత్త పథకాలు అమలు చేయకపోగా, గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అమలైన పథకాలకు సైతం గండి కొట్టింది. కార్మిక శాఖ లెక్కల ప్రకారం ఉమ్మడి విజయనగరం జిల్లాలో దాదాపు 2లక్షల పైగా మంది అసంఘటిత రంగ భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు. లెక్కల్లోకి రాని వారు మరికొన్ని వేలల్లో ఉంటారు. ఇప్పుడు వరకు నమోదు చేసుకున్న భవన నిర్మాణ కార్మికులు 91,528 మంది. వీరిలో ఎక్కువ మంది నిర్మాణ రంగంపై ఆధారపడిన తాపీ మేసీ్త్రలు, కూలీలు, రాడ్‌ బెండర్లు, ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, వడ్రంగులు, పెయింటర్లు ఉన్నారు. గతేడాది సార్వత్రిక ఎన్నికలప్పుడు భవన నిర్మాణ బోర్డును పునరుద్ధరిస్తామని టీడీపీ మేనిఫెస్టోలో చంద్రబాబు హామీ ఇచ్చారు. సాధికార సంస్ధ ఏర్పాటు చేస్తామని, అన్ని వర్గాల కార్మికులకు ప్రమాద బీమా, హెల్త్‌ ఇన్సూరెన్స్‌, తదితర సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని, కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. నేటి వరకు ఆ ఊసే ఎత్తలేదు.

పేరు మార్పు తప్ప సాయం లేదు

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైఎస్సార్‌ బీమా పథకాన్ని చంద్రన్న బీమాగా పేరు మార్చారు. అంతకు మించి పథకం అమలుపై ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఎన్నికల వేళ ఇచ్చిన హామీలన్నీ ఉత్తివిగానే మిగిలిపోయాయి. గత ప్రభుత్వంలో వైఎస్సార్‌ బీమా పథకం కింద విజయనగరం జిల్లాలో దాదాపు 11వేల కుటుంబాలకు రూ.118 కోట్ల మేర సాయం అందింది. ఈ ప్రభుత్వంలో అది పూర్తిగా నిలిచిపోయింది.

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ సాయం ఇలా..

వైఎస్సార్‌ కల్యాణమస్తు కింద భవన, ఇతర నిర్మాణ కార్మికులకు రూ.20వేలు చొప్పున అందించారు. వైఎస్సార్‌ బీమా పథకం కింద ప్రమాద మరణాల్లో బాధిత కుటుంబాలకు రూ.5 లక్షలు, సహజ మరణాలకు రూ.లక్ష, వైకల్యం సంభవిస్తే రూ.5 లక్షల చొప్పున ఇచ్చి ఆదుకున్నారు. రిజిస్టర్‌ కాని కార్మికులు ప్రమాదాల్లో మరణిస్తే రూ.5 లక్షలు, వైకల్యం సంభవిస్తే రూ.2.5 లక్షలు ఇచ్చారు. అసంఘటిత రంగ కా ర్మిక కుటుంబాల్లోని వ్యక్తులు అనారోగ్యం బారిన పడిన సందర్భాల్లో ఆరోగ్యశ్రీ పథకం కింద రూ.25 లక్షల వరకు వైద్య సేవలను పూర్తి ఉచితంగా అందించారు.

జాడ లేని సంక్షేమం..!1
1/2

జాడ లేని సంక్షేమం..!

జాడ లేని సంక్షేమం..!2
2/2

జాడ లేని సంక్షేమం..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement