
వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల ఇళ్లపై.. టీడీపీ వర్గీయుల దా
చికెన్
బ్రాయిలర్ లైవ్ డెస్‌డ్ స్కిన్‌లెస్ శ్రీ125 శ్రీ220 శ్రీ230
బాడంగి: మండలంలోని పినపెంకి గ్రామంలో అమ్మవారి పండగ ముగింపు రోజు బుధవారం సాయంత్రం వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులైన రజకుల ఇళ్లపై అదే గ్రామానికి చెందిన టీడీపీ వర్గీయులైన బెవర కులస్తులు దాడికి తెగబడ్డారు. పిడిగుద్దులతో పాటు కర్రలతో దాడి చేసినట్టు ప్రత్యక్ష సాక్షుల ద్వారా తెలిసింది. ఈ దాడిలో గాయపడిన వాడాడ పోలమ్మ, వెంపడాపు రమేష్, నందిగాం సీత, చోడవరపు అరుణలను గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు కుప్ప సింహాచలం స్థానిక సీహెచ్‌సీకి ఆటోపై తరలించారు. వీరిలో పోలమ్మ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వీరిలో అరుణ బాలింత కావడంతో ప్రధమ చికిత్స చేసి ఇంటికి పంపినట్టు వైద్యులు తెలిపారు. ఇదే విషయమై రమేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా గ్రామంలో ఇరు వర్గాలకు చెందిన యువకుల మధ్య మంగళవారం నాడే తగాదా జరిగింది. టీడీపీ వర్గీయులు ఎప్పుడు ఎలాంటి దాడులకు పాల్పడతారోనని రజకులు ఆందోళన చెందుతున్నారు. తమకు భద్రత కల్పించాలని వారు కోరుతున్నారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు అందినా కేసు నమోదు చేయకుండా తాత్సారం చేస్తున్నట్టు సింహాచలం ఆరోపించారు.

వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల ఇళ్లపై.. టీడీపీ వర్గీయుల దా

వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల ఇళ్లపై.. టీడీపీ వర్గీయుల దా