
కాళ్లు ఈడ్చుకుంటూ
ప్రభుత్వం మారింది. పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు కష్టాలు ఆరంభమయ్యాయి. ప్రజా సంక్షేమ పథకాలు ఎండమావిగా మారాయి. వలంటీర్ వ్యవస్థ రద్దయింది. లక్షల మందికి జీవనోపాధి పోయింది. ప్రజారోగ్యానికి భరోసా లేదు. ఆరోగ్య ఆసరా అందదు. పేద కుటుంబాల పిల్లల చదువుకు సాయం అందని ద్రాక్షగా మారింది. రైతన్నకు సాగుభరోసా, పంటకు గిట్టుబాటు ధర కరువైంది. నిరుద్యోగులకు భృతి ఇచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు ఎండీఎం వాహన వ్యవస్థను రద్దు చేయడంతో వేలాది మంది నిరుద్యోగులకు వచ్చేనెల 1 నుంచి ఉపాధి పోతుంది. ఇన్నాళ్లూ ఇంటివద్దనే అందిన రేషన్ సరుకుల కోసం ప్రజలకు పాట్లు తప్పవు. రోజుల తరబడి పనులు మానుకుని కాళ్లుఈడ్చుకుంటూ సరుకుల కోసం రేషన్ దుకాణాల వద్ద క్యూకట్టాల్సిందే. కొండలు దిగి ఎక్కాల్సిందే అంటూ జనం నిట్టూర్చుతున్నారు. కూటమి ప్రభుత్వ ప్రజావ్యతిరేక పాలపై మండిపడుతున్నారు.
మళ్లీ పాత రోజులే...
పార్వతీపురం మన్యంలోని 15 మండలాల పరిధి లో ఎనిమిది ఎంఎల్‌ఎస్ పాయింట్లు ఉన్నాయి. 2.81 లక్షల కార్డుదారులుండగా.. వీరందరికీ రేషన్ సరకులను ఇంటికి తీసుకొచ్చే క్రమంలో ఎండీయూ వాహన వ్యవస్థను గత ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీనివల్ల నిరుద్యోగులకు ఉపాధి అవకాశా లు కూడా కలిగాయి. మొత్తం జిల్లాకు 196 వాహ నాలు కేటాయించగా.. ఇందులో రూరల్‌లో 169, పట్టణ ప్రాంతాల్లో 27 వాహనాలు ఉన్నాయి. ఇందులో కూడా నాటి జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీలకే ప్రాధాన్యమిచ్చింది. మొత్తం వాహనాల్లో ఎస్టీలు 67, ఎస్సీలు 28, బీసీలు 90, ఈబీసీలు 10, మైనారిటీస్ 01 చొప్పున వాహ నాలు కేటాయించారు. వీరితో పాటు.. సహాయకు లకు కూడా వాహనాల వల్ల ఉపాధి దొరికింది. కూటమి ప్రభుత్వం ఈ వ్యవస్థనే మొత్తంగా ఎత్తివేస్తామని ప్రకటించడంతో వారంతా కుటుంబాలతోపాటు రోడ్డున పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు కార్డుదారులు కూడా గతం మాదిరి రేష న్ దుకాణాలకు వెళ్లి సరకులు తెచ్చుకోవాల్సిందే.