అంకితభావంతో పని చేయాలి | - | Sakshi
Sakshi News home page

అంకితభావంతో పని చేయాలి

May 22 2025 12:46 AM | Updated on May 22 2025 12:46 AM

అంకిత

అంకితభావంతో పని చేయాలి

జెడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు

విజయనగరం: విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేయాల్సిన బాధ్యత ఉద్యోగుల పట్ల ఉందని జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. ఈ మేరకు జిల్లా పరిషత్‌ కార్యాలయంలో సహాయకులుగా పని చేస్తున్న 6గురు సిబ్బందికి రికార్డు అసిస్టెంట్‌లుగా పదోన్నతి కల్పిస్తూ బుధవారం ఆయన ఉత్తర్వులు అందజేశారు. ఈ క్రమంలో సీహెచ్‌.సీతమ్మ, టి.రాములు, డి.రామస్వామి, ఆర్‌.సింహాచలం, జి.వెంకటరత్నం, ఎం.వెంకటరమణలకు జామి, మెట్టపల్లి, నాగూరు, బలిజిపేట, చింతాడ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలతో పాటు విజయనగరం జిల్లా పరిషత్‌లో మరొకరిని రికార్డ్‌ అసిస్టెంట్‌గా నియమించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ బీవీ. సత్యనారాయణ, డిప్యూటీ సీఈఓ ఆర్‌.వెంకట్‌రామన్‌ తదితరులు పాల్గొన్నారు.

సారాతో నలుగురి అరెస్టు

పాలకొండ: సారా తరలిస్తున్న కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేశామని ఎకై ్సజ్‌ సీఐ సూర్యకుమారి తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలను ఆమె బుధవారం స్థానిక విలేకరులకు వివరించారు. వీరఘట్టం మండలం మోకాసరాజపురం గ్రామ సమీపంలో జలుమూరు ప్రశాంత్‌కుమార్‌, వడ్డి సునీల్‌లు 160లీటర్లు సారాను కారులో తరలిస్తున్నట్లు గుర్తించి అదపులోకి తీసుకున్నామన్నారు. అలాగే వీరఘట్టం ఎస్సీ కాలనీలో దాడులు చేయగా బండి కస్తూరి ఐదు లీటర్ల సారాతోను, సిరిపురం ఉష మరో ఐదు లీటర్ల సారాతోను పట్టుబడినట్లు తెలిపారు. సారాతో పాటు కారును సీజ్‌ చేశామని, నలుగురు నిందితులను రిమాండ్‌కు తరలించామని వివరించారు. ఈ దాడుల్లో పాలకొండ ఎకై ్సజ్‌ స్టేషన్‌ సిబ్బంది పాల్గొన్నారని చెప్పారు.

కొండ దిగిన ఏనుగుల గుంపు

మొదలైన ఘనసర రైతుల కష్టాలు

భామిని: మండలంలోని ఘనసర రైతులకు ఏనుగుల కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. కొంతకాలంగా తివ్వాకొండల్లోకి ఏనుగులు వెళ్లడంతో ఊపిరి పీల్చుకున్న రైతులకు మళ్లీ కష్టం వచ్చిపడింది, బుధవారం భామిని మండలం ఘనసర గ్రామాన్ని ఆనుకుని ఉన్న ఐలమ్మ తోటలో నాలుగు ఏనుగుల గుంపు ప్రత్యక్షమైంది.తివ్వాకొండల్లో తాగునీటికి విలవిలలాడి కొండ దిగి వచ్చినట్లు ఫారెస్టు అధికారులు భావిస్తున్నారు.తిరిగి ఎలిఫెంట్‌ ట్రాకర్స్‌, ఫారెస్టు సిబ్బందికి ఏనుగుల రక్షణ బాధ్యతలు ఆరంభమయ్యాయి.

గంజాయి పట్టివేత

విజయనగరం క్రైమ్‌: పశ్చిమ గోదావరి జిల్లానుంచి సుమారు 4.5 కేజీల గంజాయిని తరలిస్తుండగా విజయనగరం జీఆర్‌పీ సిబ్బంది బుధవారం స్టేషన్‌లో పట్టుకున్నారు. ఇందుకు సంబంధించి జీఆర్‌పీ ఎస్సై బాలాజీరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా కోపల్లెకు చెందిన లెంక కరుణానిధి విజయనగరం రైల్వే ప్లాట్‌ ఫాంపై అనుమానంతో రెండు బ్యాగులతో సంచరిస్తుండగా పట్టుకున్నామన్నారు. నిందితుడి దగ్గర నుంచి రూ.22,500 విలువ గల 4.5 కేజీల గంజాయి స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్‌ నిమిత్తం విశాఖ రైల్వే కోర్టుకు తరలించినట్లు చెప్పారు.

అంకితభావంతో పని చేయాలి1
1/3

అంకితభావంతో పని చేయాలి

అంకితభావంతో పని చేయాలి2
2/3

అంకితభావంతో పని చేయాలి

అంకితభావంతో పని చేయాలి3
3/3

అంకితభావంతో పని చేయాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement