
అల్లం విత్తనాల పంపిణీ
సీతంపేట: ఆమదాలవలస కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో సీతంపేట ఐటీడీఏ పరిధిలోని పలు గ్రామాల్లో పీహెచ్‌ఓ ఎస్.వి.గణేష్ చేతుల మీదుగా మహిమ అనే అల్లం విత్తన రకాన్ని పంపిణీ చేశారు. బూతలగూడ, చాపరాయిగూడ, గొట్టిపల్లి, అడ్డంగి, చాపరా యిగూడ గ్రామాల రైతులకు అందజేశారు. సాగు పద్ధతులను వివరించారు. కార్యక్రమంలో వెలుగు ఎన్జీవో ఆనంద్ పాల్గొన్నారు.
పాలకొండలో
తమ్ముళ్ల తోపులాట
● మినీసంగ్రామంగా మారిన మినీ
మహానాడు సన్నాహక సమావేశం
పాలకొండ: పాలకొండ సీఎల్ నాయుడు కల్యాణమండపం ఆవరణలో బుధవారం నిర్వహించిన టీడీపీ మినీ మహానాడు సన్నాహక సమావేశం తెలుగుతమ్ముళ్లు తన్నులాటకు వేదికగా మారింది. నువ్వెంతంటే నువ్వెంతంటూ ఒకరినొకరు తోసుకున్నారు. తమ్ముళ్లు కుమ్ములాటతో సమావేశ మందిరం దద్దరిల్లింది. పరిశీలకులు సైతం పాలకొండ నాయకు లకు ఒక నమస్కారం అంటూ వేదిక నుంచి బయటకు వెళ్లిపోయారు. చివరకు పోలీసులు ఇరు వర్గాలను అదుపు చేసినా ఫలితం లేకపోయింది. గంటపాటు జరిగిన ఈ సగ్రామంలో టీడీపీ పాలకొండ నియోజకవర్గ ఇన్‌చార్జి పడాల భూదేవి వ్యతిరేక వర్గం భూదేవి డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు. తంపటాపల్లి, పొట్లి గ్రామాలకు చెందిన టీడీపీ కార్యకర్తలు హంగామా చేయడంతో ఇటు నుంచి భూదేవి వర్గీలు అరుపులు మొదలుపెట్టారు. దీంతో ఇరు వర్గాలు వారు తోపులాడుకున్నా రు. మేమే అసలైన టీడీపీ అంటూ కొందరు, మేమే మొదట నుంచి పార్టీలో ఉన్నామంటూ కొందరు వాదనలతో స్టేజిపైన ఉన్నవారు అవాక్కయ్యారు. అరకు పార్లమెంట్ పరిశీలకుడు తొట్టపూడి హర్షవర్దన్, నియోజకవర్గ పరిశీలకుడు కలమట సాగర్‌లు దీంతో స్టేజ్‌పైనుంచి దిగి వెల్లిపోయారు. గంట సమయం పాటు జరిగిన గందర గోళం అనంతరం సమావేశం ప్రారంభించి మమ అనిపించారు.

అల్లం విత్తనాల పంపిణీ