
విచారణ జరిపి, నివేదిక అందిస్తాం..: సబ్ కలెక్టర్
ఈ ఘటనపై ఐటీడీఏ పీఓ, సబ్ కలెక్టర్ అశుతోశ్ శ్రీవాత్సవ మీడియాతో మాట్లాడారు. పార్వతీపురం మండలంలోని పలు గ్రామాల నుంచి వచ్చిన ఫిర్యాదులను విచారణ చేస్తామని తెలిపారు. ప్రధానంగా తహసీల్దార్‌పైన, ఇక్కడ సిబ్బందిపైన అనేక అవినీతి ఆరోపణలు చేశారని వివరించారు. ములగ గ్రామానికి సంబంధించిన సమస్యపై గతంలోనూ ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు. దీనిపై విచారణ జరిపి, కలెక్టర్‌కు నివేదిక అందిస్తామని తెలిపారు. ఎమ్మెల్యే మీద తహసీల్దారు ఇచ్చిన ఫిర్యాదుపైనా విచారణ చేస్తామని చెప్పారు. అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.
ఇంటెలిజెన్స్ ఆరా!
పార్వతీపురం ఎమ్మెల్యే, తహసీల్దార్ మధ్య వివాదం.. శనివారం తహసీల్దార్ కార్యాలయం వద్ద జరిగిన ఉద్రిక్త పరిస్థితులు తదితర అంశాలపై ఇంటెలిజెన్స్ వర్గాలు ఆరా తీసినట్లు తెలిసింది. తహసీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకున్న ఇంటెలిజెన్స్ వర్గాలు మొత్తం ఘటనను అంతా తమ సెల్‌ఫోన్లో చిత్రీకరించారు. స్వయంగా వచ్చి పరిశీలించినట్లు తెలిసింది.