
అవాస్తవాలు పోస్టుచేస్తే చర్యలు
–10లో
నెల్లిమర్లలో టీడీపీ x బీజేపీ
నెల్లిమర్ల కూటమిలో విభేదాలు భగ్గుమంటున్నాయి. నిన్న టీడీపీ–జనసేన, నేడు టీడీపీ– బీజేపీ నాయకులు ఢీ అంటే ఢీ అంటున్నారు. రాజకీయ ఆధిపత్యం కోసం
పోటీపడుతున్నారు.
పార్వతీపురం రూరల్: సామాజిక మాధ్యమాల్లో ప్రతిఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలని, ఏదైనా సందేశం ఫార్వర్డ్, పోస్టుచేసే ముందు వాస్తవమైనదా? కాదా? అన్నది నిర్ధారణ చేసుకున్నాకే షేర్ చేయాలని ఎస్పీ ఎస్.వి.మాధవ్‌రెడ్డి సూచించారు. అలజడులు సృష్టించేలా, మనోభావాలు దెబ్బతినేలా పోస్టులు పెడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. తన కార్యాలయంలో శనివారం మాట్లాడుతూ వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్ర్ట్రాగాం, టెలిగ్రామ్, యూట్యూబ్, ఎక్స్(ట్విట్టర్) తదితర సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొట్టేలా పోస్టులు పెట్టే వారిపై శాఖాపరంగా ప్రత్యేక దృష్టిని సారించామన్నారు. తప్పుడు సమాచారం పోస్టుచేస్తే ఆయా గ్రూపులకు సంబంధించిన అడ్మిన్లు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. అత్యవసర సమయాల్లో సమన్వయంతో వ్యవహరించాలన్నారు. మతపరమైన సున్నిత అంశాల్లో వచ్చిన వదంతులు, అవాస్తవాలను సామాజిక మాధ్య మాల ద్వారా శాంతిభద్రతలకు భంగం కలిగించేలా పోస్టులు పెట్టరాదన్నారు.
యువత సహకారం అందించాలి
భారత్–పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధవాతావరణం నెలకొన్న నేపథ్యంలో యువత బాధ్యతగా వ్యవహరిస్తూ త్రివిధ దళాలకు, కేంద్ర బలగాలకు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రకటనలకు సహకరించే విధంగా సహాయ సహకారాలు అందించాలని ఎస్పీ అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతీపౌరుడు ఒక సైనికుడిలా వ్యవహరించాలన్నారు. ఇలాంటి సమయాల్లో ర్యాలీలు, ఆందోళనలు, ధర్నాలు వంటి కార్యక్రమాలు నిర్వహించరాదన్నారు. పోలీస్ ఆదేశాలను మీరితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
సోషల్ మీడియాలో బాధ్యతగా వ్యవహరించాలి
కుల, మత, ప్రాంతాల పట్ల అలజడులు సృష్టించే పోస్టులు పెట్టొద్దు
ఎస్పీ ఎస్.వి.మాధవ్‌రెడ్డి