స్పాట్‌ వాల్యుయేషన్‌ను పరిశీలించిన ఆర్‌జేడీఎస్‌ఈ | - | Sakshi
Sakshi News home page

స్పాట్‌ వాల్యుయేషన్‌ను పరిశీలించిన ఆర్‌జేడీఎస్‌ఈ

Apr 5 2025 1:01 AM | Updated on Apr 5 2025 1:01 AM

స్పాట

స్పాట్‌ వాల్యుయేషన్‌ను పరిశీలించిన ఆర్‌జేడీఎస్‌ఈ

పార్వతీపురంటౌన్‌: జిల్లా కేంద్రంలో నిర్వహిస్తు న్న పదోతరగతి స్పాట్‌ వాల్యుయేషన్‌ కేంద్రాల ను ఆర్‌జేడీఎస్‌ఈ విజయభాస్కర్‌ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసిస్టెంట్‌ ఎగ్జామినర్లు, చీఫ్‌ ఎగ్జామినర్లు, ప్రిన్సిపాల్‌ ఆఫ్‌ వాల్యుయేషన్‌ను అనుసరించి సమాధాన పత్రాలను మూల్యాంకనం చేయాలన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం పార్వతీపురం ప్రభుత్వ బాలికల పాఠశాలలో నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి డీఈఓ రమాజ్యోతి, సిబ్బంది పాల్గొన్నారు.

ఆధునికంగా సాగితే

అధిక లాభాలు

గరుగుబిల్లి: రైతులు ఆధునిక సాగు పద్ధతులు అవలంబిస్తే తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు వస్తాయని కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ప్రసాద్‌ అన్నారు. ఉల్లిభధ్రలో డాక్టర్‌ వైఎస్సార్‌ ఉద్యానవన కళాశాలలో ఖరీఫ్‌ పంటల సాగుపై ముందస్తు కార్యాచరణ ప్రణాళికపై శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులు ఆధునిక సాగు పద్ధతులు అవలంబించేలా చూడాలన్నారు. వరి పంటతోపాటు కంది, చిరుధాన్యాలు, నిమ్మగడ్డి వంటి పంటలను ప్రోత్సహించాలన్నారు. జిల్లాలో రాగిపంటకు మంచి గిరాకీ ఉందని, నూతన పద్ధతుల్లో సాగుచేస్తే ఎకరాకు పది క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందన్నారు. నూతన వ్యవసాయ విధానాలపై వ్యవసాయ సిబ్బందితో చర్చించారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్థక శాఖ అధికారులు కె. రాబర్ట్‌పాల్‌, బి.మాధవి, ఎస్‌.మన్మథరావు, డీఆర్‌డీఏ పీడీ సుధారాణి, డ్వామా పీడీ కె.రామచంద్రరావు, కేవీకె శాస్త్రవేత్త శ్రీనివాసరాజు పాల్గొన్నారు.

సుభద్రమ్మవలస

రోడ్డుపై ఏనుగులు

జియ్యమ్మవలస: మండలంలోని వెంకటరాజపురం, సుభద్రమ్మవలస రహదారిపై ఏనుగు లు శుక్రవారం హల్‌చల్‌ చేశాయి. జొన్న, పామాయిల్‌ తోటల నుంచి వచ్చిన ఏనుగులు రోడ్డు గుండా ప్రయాణించడంతో ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు. ఓ వ్యాన్‌ డ్రైవర్‌ వాహనాన్ని విడిచిపెట్టి పరుగు తీయగా, వ్యాన్‌ను చిందరవందర చేశాయి.

తొలిరోజు 46 రిజిస్ట్రేషన్లు

విజయనగరం రూరల్‌: ప్రభుత్వం నూతనంగా అమలు చేస్తున్న స్లాట్‌ బుకింగ్‌ విధానంలో తొలిరోజు శుక్రవారం 46 రిజిస్ట్రేషన్లు జరిగినట్లు విజయనగరం ఓబీ జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం జాయింట్‌ సబ్‌ రిజిస్టార్‌ బీజీఎస్‌ ప్రసాద్‌ తెలిపారు. మొత్తంగా 51 స్లాట్‌ బుకింగ్‌లు జరిగాయని, ఐదుగురు

రిజిస్ట్రేషన్లకు రాలేదని తెలిపారు.

స్పాట్‌ వాల్యుయేషన్‌ను  పరిశీలించిన ఆర్‌జేడీఎస్‌ఈ 1
1/1

స్పాట్‌ వాల్యుయేషన్‌ను పరిశీలించిన ఆర్‌జేడీఎస్‌ఈ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement