తిరిగి తిరిగి..
● అర్జీలకు లభించని మోక్షం
● మొక్కుబడిగా పీజీఆర్‌ఎస్
● అవే సమస్యలపై మళ్లీమళ్లీ వస్తున్న అర్జీదారులు
● తప్పని వ్యయప్రయాసలు
● అయ్యా.. మా గోడు వినండి అంటూ కలెక్టర్‌కు వినతులు అందజేత
వృద్ధాప్యంలో ఆగని
గంగమ్మ పోరాటం..
ఈ చిత్రంలోని వృద్ధురాలి పేరు మిరియాల గంగమ్మ. గరుగుబిల్లి మండలం గిజబ గ్రామానికి చెందిన ఆమెకు.. 2011 సంవత్సరంలో ఆర్‌ఆర్ ప్యాకేజీని అప్పటి విజయనగరం కలెక్టర్ మంజూరు చేశారు. పార్వతీపురంలోని కొత్తవలస రెవెన్యూ పరిధి సర్వే నంబరు 155లో ఇంటి స్థలం పట్టా ఇచ్చారు. అప్పటి నుంచి ఇంటి బిల్లు కోసం తిరుగుతూనే ఉంది. మరోసారి అధికారులను కలసి వేడుకుంది. ఇంటి నిర్మాణ బిల్లు ఇస్తారో, లేదోనని ఆమె ఆందోళన చెందుతున్నారు.
కాళ్లు అరగాలే గానీ..!
కాళ్లు అరగాలే గానీ..!