ధ్యాస.. ‘ధ్యానం’ ముఖ్యమే..
● పరీక్షల సమయంలో విద్యార్థులు ప్రొటీన్స్, మినరల్స్ ఉండే ఆహారం తీసుకోవాలి. పండ్లు ఎక్కువ తింటే మంచిది. నీరు ఎక్కువగా తాగాలి. మాంసాహారం, కొవ్వు పదార్థాలు, జంక్ ఫుడ్‌లకు దూరంగా ఉండటం మంచిది.
● ప్రతి రోజూ కనీసం 7 గంటలు నిద్ర ఉండేలా చూసుకోవాలి.
● ఒత్తిడి తగ్గడం కోసం చిన్నపాటి వ్యాయామాలు చేయాలి. నిత్యం ఉదయం, సాయంత్రం వేళల్లో ధ్యానం, ప్రాణామాయం వంటివి చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది.
● చదివేటప్పుడు ఒకేచోట గంటలకొద్దీ కూర్చొండిపోకుండా, మధ్యలో కాస్త విరామం ఇవ్వాలి. కొద్దిగా అటూఇటూ నడవాలి.
కట్టుదిట్టంగా..
● కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లకు అనుమతి లేదు. చీఫ్ సూపరింటెండెంట్ మినహా ఎవరి మొబైల్‌నూ అనుమతించలేదని అధికారులు స్పష్టం చేశారు. ఒకవేళ ఎవరైనా తీసుకొచ్చినా, పరీక్ష కేంద్రాల ప్రధాన గేటు వద్ద వాటిని భద్రపర్చుకోవాలి.
● పరీక్షలు జరిగే సమయంలో కేంద్రాల వద్ద 100 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉంటుంది.
● పరీక్షా కేంద్రాల పరిధిలోని జిరాక్స్, నెట్ సెంటర్లన్నీ మూసివేయాలని అధికారులు ఆదేశించారు.
● పరీక్షలు జరిగే సమయంలో వివిధ సోషల్ మీడియా సహా ఇతర ప్రసార మాధ్యమాల్లో పేపరు లీకు వంటి వదంతులు, ఫేక్ న్యూస్ వ్యాప్తి చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోనున్నారు.
● పరీక్షల నిర్వహణకు సంబంధించిన కాన్ఫిడెన్షియల్ మెటీరియల్ ఇప్పటికే జిల్లాకు చేరుకున్నాయి. వీటిని అన్ని మండలాల స్టేషన్ హౌస్‌ల్లో భద్రపరిచారు.
● ప్రతి కేంద్రంలోనూ తాగునీరు, ప్రథమ చికిత్సకు సంబంధించి ఒక ఏఎన్‌ఎంను అందుబాటులో ఉంచుతున్నారు.
సాక్షి, పార్వతీపురం మన్యం: విద్యార్థి దశలో కీలకం.. పదో తరగతి. భవిష్యత్తుకు సరైన పునాది పడేది ఈ సమయమే. ఇక్కడ వేసిన అడుగే.. మేలి మలుపు. అందుకే ప్రతి విద్యార్థికీ పదో తరగతి పరీక్షలు ముఖ్యమైనవి. చక్కని ప్రణాళికతో చదివితే.. ఒత్తిడి లేకుండా పరీక్షలు రాస్తే విజయం సిద్ధించడమే కాదు.. మంచి మార్కులూ సాధించగలమని నిపుణులు చెబుతున్నారు. జిల్లాలో పదో తరగతి పరీక్షలకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లూ చేసింది. ఈ నెల 17 నుంచి ఏప్రిల్ ఒకటో తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. ప్రతి రోజూ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు నిర్వహించనున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలూ చోటుచేసుకోకుండా విద్యాశాఖాధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. గడిచిన రెండు విద్యాసంవత్సరాల్లో పదో తరగతి ఫలితాల్లో రాష్ట్రంలోనే పార్వతీపురం మన్యం జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. సగర్వంగా జిల్లా ఖ్యాతిని ఇనుమడింపజేసింది. ఆ స్థానాన్ని నిలబెట్టుకోవడమే కాదు.. మరింత మెరుగుపర్చేలా కొద్ది రోజుల నుంచి అధికార యంత్రాంగం పక్కా ప్రణాళికతో ముందుకువెళ్లింది. ఏ, బీ, సీ, డీ కేటగిరీలుగా విద్యార్థులను విభజించడమే కాదు.. వెనుకబడిన విద్యార్థులను ప్రత్యేకంగా దత్తత తీసుకుని, వారిని కనీసం ఉత్తీర్ణత సాధించేలా సిద్ధం చేశారు. జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలలు (ప్రభుత్వ, ప్రైవేట్) 220 ఉండగా.. మొత్తం 10,455 మంది విద్యార్థులు ఈ ఏడాది పరీక్షలు రాయనున్నారు. ఇందులో రెగ్యులర్ 10,367 మంది, ప్రైవేట్ విద్యార్థులు 88 మంది ఉన్నారు.
మాస్ కాపీయింగ్‌కు తావులేకుండా చర్యలు
పరీక్షల్లో మాస్‌కాపీయింగ్, ఇతర ఘటనలకు తావు లేకుండా ఏర్పాట్లు చేశారు. మొత్తం 67 కేంద్రాలను ఏర్పాటు చేయగా.. ఇందులో అర్బన్ ప్రాంతాల్లో 19, రూరల్ ప్రాంతాల్లో 48 ఉన్నాయి. ప్రతి కేంద్రానికీ ఒక చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్‌మెంటల్ అధికారి పర్యవేక్షించేలా.. మొత్తం 67 కేంద్రాలకూ నియమించారు. మూడు ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, ఆరు సిట్టింగ్ స్క్వాడ్‌లను, 22 కస్టోడియన్–సిట్టింగ్ స్క్వాడ్(సి సెంటర్)లను నియమించారు.
సెల్‌ఫోన్లకు విరామమిద్దాం...
● పరీక్షల సమయంలో సెల్‌ఫోన్లకు విద్యార్థులు విరామమివ్వాలి. భావోద్వేగాలను ప్రభావితం చేసే సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండాలి. అధిక సమయంలో వాటితో గడిపి, విలువైన కాలాన్ని దుర్వినియోగం చేసుకోవద్దు.
● వినోదం కోసం టీవీలు, సినిమాలు, విందులు, వేడుకలు వంటివాటిని పరీక్షా కాలంలో పూర్తిగా పక్కనపెట్టాలి.
ప్రత్యేక కంట్రోల్‌రూం ఏర్పాటు
జిల్లాస్థాయిలో 90637 68050 నంబరుతో ప్రత్యేక కంట్రోల్‌రూం ఏర్పాటు చేశారు. ఎక్కడైనా ఎటువంటి సమస్యలు తలెత్తినా ఈ నంబర్‌కు ఫోన్ చేసి తెలియజేయవచ్చు.
పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. పకడ్బందీ చర్యలు తీసుకున్నాం. ఎటువంటి సమస్యలు తలెత్తినా వెంటనే తెలియజేసేందుకు డీఈవో కార్యాలయంలో కంట్రోల్‌రూం ఏర్పాటు చేశాం. తాగునీరు అందుబాటులో ఉంచుతున్నాం. వేసవి దృష్ట్యా నిరంతరం విద్యుత్తు సరఫరా ఉండేలా చర్యలు తీసుకున్నాం.
–ఎన్.తిరుపతినాయుడు,
జిల్లా విద్యాశాఖాధికారి
న్యూస్‌రీల్
పదోతరగతి పరీక్షలకు సర్వం సిద్ధం
రేపటి నుంచి ఏప్రిల్ ఒకటో తేదీ వరకు నిర్వహణ
ఆదివారం శ్రీ 16 శ్రీ మార్చి శ్రీ 2025
ఆదివారం శ్రీ 16 శ్రీ మార్చి శ్రీ 2025
ఆదివారం శ్రీ 16 శ్రీ మార్చి శ్రీ 2025
ఆదివారం శ్రీ 16 శ్రీ మార్చి శ్రీ 2025