గుమ్మలక్ష్మీపురం: విశాఖపట్నంలో ఈనెల 12న జరిగిన జన్ జాతీయ గౌరవ దివస్ గిరిజన స్వాభిమాన్ వేడుకలు–2025లో భాగంగా నిర్వహించిన స్టేట్ లెవెట్ ట్రైబల్ పెయింటింగ్ అండ్ ఆర్ట్ కాంపిటీషన్‌లో పార్వతీపురం ఐటీడీఏ పరిధిలోని గిరిజన యువకులు, విద్యార్థులు ప్రతిభ చూపారు. ఈ మేరకు ఈ పోటీల నిర్వహణలో పాల్గొన్న లైజనింగ్ ఆఫీసర్/డ్రాయింగ్ టీచర్ రుగడ శ్రీనివాసరావు గురువారం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ సీనియర్ విభాగంలో గుమ్మలక్ష్మీపురం మండలంలోని తాడికొండ గ్రామానికి చెందిన మండంగి బాలచంద్రుడు వేసిన ఆర్ట్ ప్రథమస్థానం పొందిందని తెలిపారు. ఈ నేపథ్యంలో బాలచంద్రుడుకు రూ.10వేల నగదు ప్రోత్సాహంతో పాటు ప్రశంసాపత్రం, షీల్డ్‌ను నిర్వాహకులు అందజేశారన్నారు. అలాగే ద్వితీయ స్థానం పొందిన గుమ్మలక్ష్మీపురం మండలం టిక్కబాయి ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాల విద్యార్థి ఆరిక రాజేష్‌కు రూ.5వేల నగదుతో పాటు ప్రశంసాపత్రం, షీల్డ్‌ను అందజేశారని, ప్రత్యేక బహుమతులను కురుపాంలోని ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థులు గౌతమ్, అన్వితలకు అందజేశారని పేర్కొన్నారు.