
పార్వతీపురం జెడ్పీహెచ్‌ఎస్ ఉన్నత పాఠశాల సందర్శనలో ఎంఈఓ విమలాకుమారి (ఫైల్)
182 మంది ప్రత్యేక అధికారుల నియామకం
జిల్లాలోని 182 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు సంబంధించి మండల, డివిజన్, జిల్లాస్థాయి అధికారులు 182 మందిని కలెక్టర్ నియమించారు. ఈ సంవత్సరాంతపు పరీక్షలు పూర్తయ్యేవరకు ఏడు రోజులకోసారి కేటాయించిన పాఠశాలలను సంబంధిత ప్రత్యేకాధికారులు సందర్శిస్తారు. చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తిస్తారు. వారు ఉత్తీర్ణత సాధించేందుకు తీసుకోవాల్సిన చర్యలను ఉపాధ్యాయులతో చర్చించి వాటిని అమలుచేస్తారు. ప్రతి విద్యార్థి పదోతరగతి ఉత్తీర్ణుడై ఉన్నత శిఖరాలకు చేరుకునేలా ఆత్మస్థైర్యం నింపుతున్నారు.
