
శిక్షణ కార్యక్రమంలో మాట్లాడుతున్న శ్రీకాకుళం డీఈఓ తిరుమలచైతన్య
సాలూరు: అంతర్జాతీయ మాస్టర్ అథ్లెటిక్స్ పోటీలకు అర్హత సాధించిన సాలూరు మండలం శివరాంపురం గ్రామానికి చెందిన జర్జాపు పైడిరాజును డిప్యూటీ సీఎం, గిరిజన సంక్షేమ శాఖమంత్రి పీడిక రాజన్నదొర అభినందించారు. మార్చి నెలలో పశ్చిమబెంగాల్‌లో జరిగిన జాతీయ మాస్టర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీల్లో 100, 800, 1600 మీటర్లు విభాగాల్లో బంగారుపతకాలు, 400 మీటర్లు రిలేలో వెండి పతకం సాధించింది. ఈ ఏడాది ఆగస్టు 18, 19, 20 తేదీల్లో శ్రీలంకలో జరగబోయే ఇంటర్నేషనల్ మాస్టర్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్‌కు ఎంపికై ంది. శ్రీలంకకు వెళ్లేందుకు ఆర్థిక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని తెలుసుకున్న రాజన్నదొర.. ఆదుకుంటానని హామీ ఇచ్చారు.
సరుకుల సరఫరాకు టెండర్లు
సీతంపేట: సీతంపేట ఐటీడీఏ పరిధిలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, గిరిజన గురుకులాలు, పోస్ట్‌మెట్రిక్ వసతి గృహాలకు అవసరమైన నిత్యావసర సరుకుల సరఫరాకు గిరిజన సహకార సంస్థ ఆధ్వర్యంలో టెండర్లు పిలిచారు. గిరిజన సంక్షేమశాఖ డీడీ బి.నగేష్, జీసీసీ డివిజనల్ మేనేజర్ జి.సంధ్యారాణి సమక్షంలో షీల్డ్ టెండర్లను శుక్రవారం ఓపెన్ చేశారు. 53 రకాల సరుకుల సరఫరాకు ఏడుగురు టెండర్లు వేశారు. కందిపప్పు, బన్సీరవ్వ, శనగపప్పు, బఠాణీ, ఇడ్లీరవ్వ, మినపగుళ్ళు, పసుపు, కారంతో పాటు ఇతర నిత్యావసర సరుకుల సరఫరాకు ధరలను కోట్ చేశారు. ఈ సందర్భంగా డీడీ మాట్లాడుతూ ఐటీడీఏ పీఓ ధరల పరిశీలన అనంతరం టెండరు ఖరారు చేస్తామన్నారు. కార్యక్రమంలో ఏపీఓ రోసిరెడ్డి, ఎడ్యుకేషన్ ఓఎస్‌డీ యుగంధర్, జీసీసీ మేనేజ ర్లు గొర్లె నరసింహులు, దాసరి కృష్ణ, ఏటీడబ్ల్యూఓలు శ్రీనివాసరావు, మంగవేణి, గురుకులం సెల్ ఇన్‌చార్జి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
నాణ్యతలో రాజీపడొద్దు
● ఐటీడీఏ పీఓ విష్ణుచరణ్
పార్వతీపురం: గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించడంలో రాజీపడొద్దని ఐటీడీఏ పీఓ సి.విష్ణుచరణ్ అధికారులకు సూచించారు. పార్వతీపురం మండలం బొండపల్లిలో జరుగుతున్న గడపగడపకు మన ప్రభుత్వం పనులను ఆయన శుక్రవారం పరిశీలించారు. సచివాలయం పరిధిలో నిర్మిస్తున్న సీసీ రోడ్లు, కాలువల పనుల పురోగ తిని పీఆర్ ఇంజినీరింగ్ అధికారి రత్నకుమార్ ను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుత వాతావర ణం నిర్మాణ పనులకు అనుకూలమైనందున త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఈ పరిశీలనలో పీఆర్ ఏఈ చంద్రమౌళి, సచివాలయ ఇంజినీరింగ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.
శిక్షణ సద్వినియోగం కావాలి
పాలకొండ రూరల్: ప్రభుత్వం ఉపాధ్యాయుల కు అందిస్తున్న శిక్షణ సద్వినియోగం చేసుకోవా లని శ్రీకాకుళం జిల్లా విద్యా శాఖాధికారి ఎస్.తిరుమలచైతన్య అన్నారు. స్థానిక తమ్మినాయుడు విద్యా సంస్థల్లో డీఎస్సీ–2018 ఉపాధ్యాయులకు శుక్రవారం వృత్యంతర శిక్షణ తరగతులు నిర్వహించారు. జాతీయ విద్యా విధానం, విద్యా హక్కు చట్టం, బహుళ తరగతుల బోధన, నిర్మాణాత్మక అభ్యసనంపై అవగాహ న కల్పించారు. కార్యక్రమంలో ఉపవిద్యా శాఖాధికారిణి ఆర్.విజయకుమారి, జి.వి.రమణ, రిసోర్స్‌పర్సన్లు సంతోష్‌కుమార్, ఉషారాణి,పాలకొండ, సీతంపేట, భామిని, వీరఘట్టం మండలాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

పెదబొండపల్లిలో సీసీ రోడ్డు, కల్వర్టును పరిశీలిస్తున్న పీఓ విష్ణుచరణ్

షీల్డ్ టెండర్లు ఓపెన్ చేస్తున్న అధికారులు