
●మలేరియా సోకితే శరీర ఉష్ణోగ్రత పెరుగుతంది. కొన్నిసార్లు చలికూడా వస్తుంది. ఫాల్సిఫారమ్ మలేరియా తీవ్రంగా ఉంటుంది. జ్వరం వచ్చిన రెండుగంటలలోపు ఆస్పత్రిలో చేర్పించాలి.
●తలనొప్పి, ఒంటినొప్పులు, వణుకుతో కూడిన చలిజ్వరం, చెమటలు పట్టడం వంటి లక్షణాలతో బాధపడుతున్నవారికి రక్తపరీక్షలు చేయించాలి.
●జ్వరం రోజువిడిచి రోజు రావచ్చు. మలేరియా క్రిములున్న దోమ ఆరోగ్యవంతులకు కుట్టిన 10 నుంచి 14 రోజుల్లో వ్యాధి లక్షణాలు బయట పడతాయి.
●జ్వరంతోపాటు వాంతులు కూడా అవుతుంటాయి.