బాలికలు క్రీడలతో పాటు విద్యలో కూడా రాణించాలి | - | Sakshi
Sakshi News home page

బాలికలు క్రీడలతో పాటు విద్యలో కూడా రాణించాలి

Jan 25 2026 7:18 AM | Updated on Jan 25 2026 7:18 AM

బాలికలు క్రీడలతో పాటు విద్యలో కూడా రాణించాలి

బాలికలు క్రీడలతో పాటు విద్యలో కూడా రాణించాలి

బాలికలు క్రీడలతో పాటు విద్యలో కూడా రాణించాలి

జాతీయ బాలికా దినోత్సవంలో

జేసీ సంజన సింహ

నరసరావుపేట: బాలికలు క్రీడలతోపాటు విద్యలో కూడా విజయాలు సాధించి జీవితంలో మంచి స్థాయికి చేరాలని జాయింట్‌ కలెక్టర్‌ సంజన సింహ పేర్కొన్నారు. శనివారం జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో నిర్వహించిన జాతీయ బాలికా దినోత్సవానికి జేసీ ముఖ్య అతిఽథిగా హాజరయ్యారు. జేసీ మాట్లాడుతూ హక్కులపై ప్రతి బాలిక అవగాహన కలిగి ఉండాలని అన్నారు. బాల్యవివాహాల నిరోధకానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. జిల్లా మహిళా, శిశు సంక్షేమ సాధికారత అధికారి ఉమాదేవి మాట్లాడుతూ పిల్లల పట్ల తల్లిదండ్రులు నమ్మకంతో ఉండేలా మెలగాలని సూచించారు. బాలికలు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. జిల్లా వైద్య అధికారి డాక్టర్‌ బి.రవి మాట్లాడుతూ చిన్న వయస్సులో గర్భం దాలుస్తున్న వారి సంఖ్య పల్నాడు జిల్లాలో అధికంగా ఉందని అన్నారు. జిల్లా సోషల్‌ వెల్ఫేర్‌ అధికారి, సీడీపీఓలు, అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement