చదువులమ్మ చెట్టు నీడలో..! | - | Sakshi
Sakshi News home page

చదువులమ్మ చెట్టు నీడలో..!

Dec 15 2025 8:59 AM | Updated on Dec 15 2025 8:59 AM

చదువులమ్మ చెట్టు నీడలో..!

చదువులమ్మ చెట్టు నీడలో..!

చిలకలూరిపేట: ఏరా శ్రీను.. ఎలా ఉన్నావు... పిల్లలు, కుటుంబ సభ్యులు అందరూ క్షేమమా అంటూ కాంతారావు పలకరింపు. బాగానే ఉన్నాను.. మీ పిల్లలు అంతా సెటిల్‌ అయ్యారా అంటూ శ్రీనివాసరావు ప్రతి పలకరింపు. 50 ఏళ్ల తర్వాత కలసిన మిత్రుల మధ్య భావోద్వేగ సన్నివేశమిది. చిలకలూరిపేట ఆర్‌వీఎస్‌ సీవీఎస్‌ హైస్కూల్‌లో 1974– 75 టెన్త్‌ బ్యాచ్‌ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం ఆదివారం పాఠశాల ప్రాంగణంలో జరిగింది. 50 ఏళ్ల కిందట ఇక్కడ చదువుకుని.. వివిధ ప్రాంతాలలో స్థిర పడిన పూర్వ విద్యార్థులు ఈ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని పాత జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. స్కూల్‌ ప్రాంగణంలో తిరుగుతూ నాడు తాము చేసిన అల్లరి తలుచుకుంటూ, తరగతి గదులను పరిశీలించి ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకున్నారు. చిన్న పిల్లల తరహా సందడి చేశారు. ఆత్మీయ ఆలింగనాలు చేసుకుంటూ తమకు పాఠాలు చెప్పిన ఉపాధ్యాయులను తలుచుకున్నారు. నాడు పాఠాలు బోధించిన గురువులు ప్రతాప వెంకట సుబ్రమణ్యశాస్త్రి, చిట్టిపోతు పట్టాభిరామారావు, ఎన్‌ వెంకట సుబ్బారావులను ఘనంగా సన్మానించారు. ఒకరికొకరు కొసరికొసరి వడ్డించుకుంటూ భోజనాలు చేశారు. సాయంత్రం బరువెక్కిన హృదయాలతో వీడ్కోలు చెప్పుకున్నారు. 1975లో స్కూల్‌ ఎస్‌పీఎల్‌గా వ్యవహరించిన డీఎల్‌ కాంతారావు, పూర్వ విద్యార్థులు కందిమళ్ల రాంబాబు, కృష్ణమూర్తి, నాగరాజు, చంద్రశేఖరరావు, రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు.

చిలకలూరిపేట ఆర్‌వీఎస్‌ హైస్కూల్‌లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

50 ఏళ్ల తర్వాత కలుసుకున్న మిత్రులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement