ఖోఖో బాలబాలికల జిల్లా జట్ల ఎంపిక
నకరికల్లు: ఉమ్మడి గుంటూరు జిల్లా ఖోఖో అసోసియేషన్ పల్నాడు జిల్లా ఖోఖో జట్టు సెలక్షన్స్ స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆదివారం నిర్వహించారు. ఉత్కంఠభరితంగా సాగిన సెలక్షన్స్‌ను గుంటూరు జిల్లా ఖోఖో అసోసియేషన్ అధ్యక్షుడు వీరభధ్రారెడ్డి, కార్యదర్శి చింతా పుల్లయ్య, ట్రెజరర్ జి.ఝాన్సీరాణిలు పర్యవేక్షించారు. సుమారు 200 మందికి పైగా బాలబాలికలు సెలక్షన్స్‌కు హాజరు కాగా బాలబాలికల్లో సీనియర్స్, జూనియర్స్ విభాగాల్లో సెలక్షన్స్ నిర్వహించారు. ఒక్కో జట్టుకు 19 మంది చొప్పున క్రీడాకారులను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా కార్యదర్శి చింతా పుల్లయ్య మాట్లాడుతూ పల్నాడు జిల్లా జట్టుకు ఎంపికై న క్రీడాకారులు ఈనెల 19వతేదీ నుంచి 21వరకు జె.పంగులూరులోను, 24వ తేదీ నుంచి 26 వరకు గుడివాడలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని అన్నారు. జిల్లా జట్టుకు ఎంపికై న క్రీడాకారులకు పలువురు అభినందనలు తెలిపారు.


