సహకార సంఘ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
పెదకూరపాడు: రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘం ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంఘం జిల్లా అధ్యక్షుడు గుడిపూడి పీఏసీఎస్ సీఈఓ జాన్ సైదా డిమాండ్ చేశారు. పెదకూరపాడులోని కో–ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్‌లో సోమవారం ఉద్యోగులు ధర్నా నిర్వహించి, మేనేజర్‌కు వినతిపత్రం అందజేశారు. సంఘ సభ్యులు మాట్లాడుతూ జీఓ నెంబర్ 36 ను వెంటనే అమలుచేసి, పెండింగ్‌లో ఉన్న వేతన సవరణ చేసి మధ్యంతర భృతిని ఇవ్వాలని డిమాండ్ చేశారు. గ్రాడ్యూటీ చట్టాన్ని అమలుపరిచి చట్టపరంగా చెల్లించాలన్నారు. సహకార సంఘాలలో పనిచేసే ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులు మాదిరిగా రిటైర్మెంట్ వయసు 62 ఏళ్లకు పెంచాలన్నారు. రైతులకు సకాలంలో జిల్లా బ్యాంకుల ద్వారా కాకుండా సహకార సంఘాల ద్వారానే రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఫణిదం సీఈఓ శ్రీనివాసరావు, పర్సన్ తాళ్లూరు సీఈఓ శివకుమారి, అర్చన పాల్గొన్నారు.
రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘం
జిల్లా అధ్యక్షుడు జాన్‌సైదా


