అంగన్‌వాడీ సమస్యలు పరిష్కరించకపోతే ఈనెల 12న ధర్నా
నరసరావుపేట: రాష్ట్రంలోని అంగన్‌వాడీ మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చి వారి వేతనాలు పెంచాలని ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయు) నాయకులు కోరారు. ఈ మేరకు సమగ్ర శిశు అభివృద్ధి కేంద్రంలో సోమవారం వినతిపత్రం సమర్పించారు. జిల్లా అధ్యక్షులు గుంటూరు మల్లీశ్వరి మాట్లాడుతూ సమస్యలు పరిష్కారం చేయాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా డిసెంబర్ 12న జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద ఆందోళన చేస్తామని హెచ్చరించారు. అంగన్వాడీలకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలన్నారు. హెల్పర్ల ప్రమోషన్‌కు నిర్దిష్టమైన గైడ్‌లైన్స్ రూపొందించాలని, సంక్షేమ పథకాలు అమలుచేసి, అన్ని యాప్‌లు కలిపి ఒకేయాప్‌గా మార్చాలని, సెంటర్ నిర్వహణకు 5జి ఫోన్లు ఇవ్వాలని, ఎఫ్‌అర్‌ఎస్ రద్దు చేయాలని, గ్రాట్యూటీ అమలుకు గైడ్‌లైన్స్ రూపొందించి వేతనంతో కూడిన మెడికల్ లీవ్ ఇవ్వాలని కోరారు.
నందిగామ టౌన్: చెడు వ్యసనాలకు బానిసై ఖరీదైన మోటారు సైకిళ్లను అపహరించి తాకట్టు పెట్టి వచ్చిన డబ్బుతో జల్సాలు చేస్తున్న ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు విజయవాడ డీసీపీ లక్ష్మీనారాయణ తెలిపారు. పట్టణంలోని పోలీస్ స్టేషన్‌లో సోమవారం ద్విచక్ర వాహనాలు అపహరిస్తున్న వ్యక్తులను మీడియా ఎదుట ప్రవేశపెట్టి చోరీ వివరాలను వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం ఇండ్లూరి గ్రామానికి చెందిన ఏపురి శివ, నకిరేకల్ మండలం చీమలగడ్డ గ్రామానికి చెందిన కుర్రి మహేంద్ర, మేడిపల్లి ఉమేష్‌చంద్ర, నకిరేకల్‌కు చెందిన కంచుకొమ్మల సంజయ్ కుమార్, నల్గొండ జిల్లా దామచర్ల గ్రామానికి చెందిన ఊదర సంతోష్ గత కొంత కాలంగా ఖరీదైన ద్విచక్ర వాహనాలను అపహరించి వాటిని తాకట్టు పెడుతూ వచ్చిన డబ్బుతో జల్సాలు చేస్తున్నారు. 20 రోజుల క్రితం నందిగామ పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదు ద్విచక్ర వాహనాలు అపహరణకు గురయ్యాయి. ఈ నేపథ్యంలో నందిగామ శివారు వై జంక్షన్ వద్ద ఎస్‌ఐలు మోహనరావు, సూర్యవంశీ వాహనాలు తనిఖీ చేస్తుండగా హైదరాబాద్ వైపు నుంచి విజయవాడ వైపు వస్తున్న ఐదుగురు యువకులు పోలీసులను చూసి పారిపోయేందుకు యత్నించగా వారిని పట్టుకున్నట్టు తెలిపారు. వారి వద్ద నుంచి రూ.26 లక్షల విలువ చేసే నందిగామ పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదు, పిడుగురాళ్ల ఒకటి, నరసరావుపేట ఒకటి, పెనమలూరు ఒకటి, కృష్ణలంక ఒకటి, రెంటచింతల ఒకటి తో పాటు ఆయా ప్రాంతాలలో చోరీకి పాల్పడిన మరో ఐదు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకున్న ఎస్‌ఐలను అభినందించి రివార్డు అందజేశారు. సమావేశంలో ఏసీపీ తిలక్, సీఐ వైవీఎల్ నాయుడు, ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.
అంగన్‌వాడీ సమస్యలు పరిష్కరించకపోతే ఈనెల 12న ధర్నా
అంగన్‌వాడీ సమస్యలు పరిష్కరించకపోతే ఈనెల 12న ధర్నా


