నేతన్నకు కన్నీళ్లు | - | Sakshi
Sakshi News home page

నేతన్నకు కన్నీళ్లు

Nov 2 2025 9:10 AM | Updated on Nov 2 2025 9:10 AM

నేతన్

నేతన్నకు కన్నీళ్లు

సత్తెనపల్లి: మోంథా తుఫాన్‌ నేపథ్యంలో కురిసిన వర్షాలకు చేనేత కుటుంబా లు విలవిలాడుతున్నా యి. చేనేత పనులు సాగక కుటుంబ పోషణ భారంగా మారింది. మూడు రోజులపాటు కురిసిన వర్షాలకు మగ్గం గుంతల్లోకి నీరు చేరడంతోపాటు మగ్గంపై ఉన్న పొడుగు, నూలు వంటివి దెబ్బతిన్నాయని చేనేత కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మగ్గం గుంతల్లో నీరు మొత్తం ఎండితే గాని పనులు పున:ప్రారంభించలేరు. అప్పటి వరకు మగ్గంపై ఉన్న పొడుగు, జరీ వంటివి రంగు మారిపోయి చెడిపోయే ఆస్కారం ఉంది. దీంతో చేనేత కార్మికులు నష్టాలపాలయ్యారు. జిల్లాలోని చిలకలూరిపేట, ఈపూరు, మాచవరం, మాచర్ల, లింగంగుంట్ల, గణపవరం, యడవల్లి, సత్తెనపల్లి సుందరయ్య కాలనీ ప్రాంతాల్లో వేల మంది కార్మికులు చేనేతపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు కార్మికులకు ఇస్తామన్న రూ.25 వేల ప్రోత్సాహం హామీ ఏడాదిన్నర కావస్తున్నా నేటికీ అమలు కాలే దు. చేనేత కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ ఇస్తామని చెప్పినా ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. నేతన్న జీవితాలకు ప్రభుత్వ సహాయం కోసం ఎదురు చూపులు తప్పడం లేదు. మోడుబారిన మగ్గం బతుకులకు గత వైఎస్సా ర్‌ సీపీ ప్రభుత్వం చేయూత అందించింది. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్‌ నేతన్న నేస్తం పథకంతో చేనేత పరిశ్రమకు ఊపిరి పోశా రు. ఈ పథకం కింద అర్హత కలిగిన చేనేత కుటుంబానికి రూ.24 వేలు ఒకేసారి నేరుగా వారి బ్యాంకు ఖాతాలకే జమ చేశారు. ఐదు విడతల్లో ఒక్కో నేత కార్మికుడికి రూ.1.20 లక్షలు జమ చేసి నేతన్నను జగన్‌ ప్రభుత్వం ఆదుకుంది. దీంతోపాటు ఆప్కో ద్వారా వస్త్రాల కొనుగోలు చేయించడం, చేనేత కార్మికులకు ప్రభుత్వం నుంచి రూ. 25,000 సబ్సిడీ రుణాలను మంజూరు చేసి చేనేత కుటుంబాలను గత ప్రభుత్వం ప్రోత్సహించి ఆదుకుంది.

ప్రభుత్వం తక్షణమే చేనేతలను ఆదుకోవాలి

మోంథా తుఫాన్‌ కారణంగా మగ్గం గుంతల్లో వర్షపునీరు చేరి వారం రోజులకు పైగా పనులు నిలిచి పోయాయి. జీవనం కష్టంగా మారడంతో ఇబ్బందులు పడుతున్నాం. తక్షణమే ప్రభుత్వం చేనేత కార్మికులను ఆదుకునేందుకు ముందుకు రావాలి. దీంతోపాటు 200 యూనిట్లు ఉచిత విద్యుత్‌ను అమలు చేసి చిత్తశుద్ధిని కూటమి ప్రభుత్వం నిరూపించుకోవాలి.

మోంథా తుఫాన్‌కు మగ్గం

గుంతల్లోకి చేరిన నీరు

పది రోజులుగా నిలిచిన చేనేత పనులు

భారంగా మారుతున్న

చేనేతల బతుకులు

ప్రభుత్వ సాయం కోసం

ఎదురు చూపులు

బతుకు భారంగా మారి...

వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో ..

జిల్లాలో చేనేత

సహకార సంఘాలు

– పంతంగి ప్రభాకర్‌,

చేనేత కార్మికుడు, సత్తెనపల్లి

19

సభ్యులు : సుమారు

2,500

నేతన్నకు కన్నీళ్లు1
1/1

నేతన్నకు కన్నీళ్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement