బిర్సా ముండా ఆశయాలు యువతకు స్ఫూర్తి
● బాలికల సంక్షేమ వసతి గృహంలో
ఘనంగా జన్ జాతీయ గౌరవ దివాస్
● ముఖ్యఅతిథిగా హాజరైన
కలెక్టర్ కృతికా శుక్లా
నరసరావుపేట: బిర్సా ముండా ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా యువతకు సూచించారు. బిర్సా ముండా జయంతి, గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల జయంతి సందర్భంగా శనివారం గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలికల గిరిజన సంక్షేమ వసతి గృహంలో కార్యక్రమాలు నిర్వహించారు. కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై బిర్సా ముండా చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారత ఆదివాసీ స్వాతంత్య్ర పోరాటానికి జెండా పట్టిన ధీశాలి బిర్సా ముండా అన్నారు. చిన్న వయస్సు నుంచే బ్రిటీష్ పాలకులు, భూస్వాముల దోపిడీపై పోరాటం చేశారని చెప్పారు. బిర్సా ముండా సేవలను గుర్తించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆయన జయంతి రోజును జన్ జాతీయ గౌరవ దివాస్‌గా ప్రకటించిందని తెలియజేశారు. అందుకే నేడు దేశవ్యాప్తంగా ఆదివాసీలు, గిరిజనులు ఆత్మగౌరవ వేడుకలు జరుపుకుంటున్నారని వివరించారు. హాస్టల్ ఆవరణలో మొక్కలు నాటా రు. గిరిజన సంక్షేమ అధికారి సుబ్బయ్య ఉన్నారు.


