కోదండరామునికి లక్షతులసి దళార్చన
తెనాలిరూరల్: ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) తెనాలి శాఖ నూతన కార్యవర్గ ఎన్నిక శుక్రవారం రాత్రి ఇక్కడి బోస్‌రోడ్డులోని అసోసియేషన్ హాలులో నిర్వహించారు. ఎన్నికల పరిశీలకులు డాక్టర్ జి.నరసింహారావు, డాక్టర్ ఎంవీ సత్యనారాయణ, డాక్టర్ జె.శివప్రసాద్ బాబు సమక్షంలో ఎన్నికలు నిర్వహించగా, 2025–26 కాలానికి అధ్యక్షుడిగా డాక్టర్ కొత్తమాసు శ్యాంప్రసాద్, సంయుక్త కార్యదర్శి గా డాక్టర్ టి.రాకేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా డాక్టర్ జి.రవిశంకరరావు, ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ జి.కోటేశ్వరప్రసాద్, కోశాధికారిగా డాక్టర్ టి.అఖిలేష్ గెలుపొందారు.
నగరం: శ్రీరామ నామస్మరణతో బాపట్ల జిల్లాలోని నగరం గ్రామం మార్మోగింది. గౌడపాలెంలోని రామమందిరం వద్ద శనివారం అభయాంజనేయ స్వామి 13 అడుగుల ఏకశిలా విగ్రహ ప్రతిష్టా మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. శ్రీకారం ప్రకాష్ శర్మ పర్యవేక్షణలో వేదపండితులు శాస్త్రయుక్తంగా విశేష పూజలు జరిపి విగ్రహాన్ని ప్రతిిష్టించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు చేశారు. అనంతరం అన్నదానం చేశారు.
ఏఎన్‌యూ(పెదకాకాని): వర్సిటీలోని వివిధ జీవశాస్త్ర విభాగాలకు చెందిన ఆరుగురు విద్యార్థులు హైదరాబాద్‌లోని ప్రముఖ ఔషధ సంస్థ డాక్టర్ రెడ్డి లాబొరేటరీస్‌లో ఆరు నెలల ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌కి ఎంపికయ్యారని వీసి ఆచార్య కె. గంగాధరరావు అన్నారు. ఈ సందర్భంగా శనివారం వారిని అభినందించారు. వీసీ మాట్లాడుతూ ఈ కాలంలో ప్రతి విద్యార్థికి నెలకు రూ. 25 వేలు స్టైఫండ్ అందజేయబడుతుందన్నారు. ఇంటర్న్‌షిప్ విజయవంతంగా పూర్తి చేసిన తరువాత, విద్యార్థులకు సంవత్సరానికి 5 లక్షల రూపాయల వేతనంతో శాశ్వత నియామకం కల్పించబడుతుందన్నారు.
కోదండరామునికి లక్షతులసి దళార్చన
కోదండరామునికి లక్షతులసి దళార్చన
కోదండరామునికి లక్షతులసి దళార్చన


