పులిచింతలకు 68,172 క్యూసెక్కులు విడుదల | - | Sakshi
Sakshi News home page

పులిచింతలకు 68,172 క్యూసెక్కులు విడుదల

Oct 31 2025 7:36 AM | Updated on Oct 31 2025 7:36 AM

పులిచ

పులిచింతలకు 68,172 క్యూసెక్కులు విడుదల

సత్రశాల(రెంటచింతల): మండలంలోని సత్రశాల వద్ద నున్న నాగార్జునసాగర్‌ టెయిల్‌పాండ్‌ విద్యుత్‌ ప్రాజెక్టు రిజర్వాయర్‌ ఐదు క్రస్ట్‌గేట్లు, రెండు యూనిట్ల ద్వారా ఉత్పాదన అనంతరం మొత్తం 68,172 క్యూసెక్కులు పులిచింతలకు విడుదల చేసినట్లు ఎస్‌ఈ వెంకటరమణ, ఈఈ సుబ్రహ్మణ్యం గురువారం తెలిపారు. టెయిల్‌పాండ్‌ ప్రాజెక్టు రిజర్వాయర్‌ ఐదు క్రస్ట్‌గేట్లు రెండు మీటర్లు ఎత్తు ఎత్తి 59,664 క్యూసెక్కులు, రెండు యూనిట్ల ద్వారా విద్యుత్పాదన అనంతరం 8,508 క్యూసెక్కులు మొత్తం 68,172 క్యూసెక్కుల వరద నీటిని దిగువనున్న పులిచింతల ప్రాజెక్ట్‌కు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ప్రాజెక్టు నీటిమట్టం 75.50 మీటర్లకు గాను 75.50 మీటర్లకు చేరుకుందన్నారు. రిజర్వాయర్‌ గరిష్ట నీటి సామర్థ్యం 7.080 టీఎంసీలకుగాను ప్రస్తుతం 7.080 టీఎంసీలు నిల్వ ఉందన్నారు. ప్రస్తుతం నాగార్జున సాగర్‌ నుంచి 66,139 క్యూసెక్కులు వస్తుందని, ఎగువ నుంచి వచ్చే వరదను బట్టి దిగువనున్న పులిచింతలకు నీటిని విడుదల చేస్తామని తెలిపారు.

వీవీఐటీయూలో ‘ఐక్యా 2కే25’

పెదకాకాని: వీవీఐటీ యూనివర్సిటీలో ఐఈటీ ఈ విద్యార్థి విభా గం ఆధ్వర్యంలో ఐక్యా 2కే25 సాంకేతిక సదస్సు ఘనంగా ప్రారంభమైనట్లు విశ్వవిద్యాలయం ప్రో చాన్స్‌లర్‌ వాసిరెడ్డి మహదేవ్‌ తెలిపారు. నంబూరు వీవీఐటీయూలో గురువారం ఈ సదస్సు ప్రారంభ కార్యక్రమానికి సౌత్‌ సెంట్రల్‌ రైల్వే విజయవాడ డివిజన్‌ సీనియర్‌ డివిజనల్‌ ఎలక్ట్రికల్‌ ఇంజినీర్‌ సీహెచ్‌. దినేష్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రెండు రోజుల పాటు నిర్వహించనున్న ఈ సదస్సులో 30 కళాశాలలకు చెందిన 1400 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సదస్సులో కోడ్‌ వర్డ్‌, స్పెల్‌ బిడ్‌, ఐక్యా ఇన్నోవేషన్‌ హాక్‌ థాన్‌, హాగ్వార్ట్స్‌ హంట్‌ వంటి 15 సాంకేతిక అంశాలలో పోటీలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా దినేష్‌రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు సాఫ్ట్‌ స్కిల్స్‌, టెక్నికల్‌ స్కిల్స్‌పై దృష్టిసారించాలని తెలిపారు. అకడమిక్‌ డీస్‌ డాక్టర్‌ గిరిబాబు, ఈసీఈ విభాగాధిపతి డాక్టర్‌ ఎం.భానుమూర్తి పాల్గొన్నారు.

పులిచింతలకు 68,172 క్యూసెక్కులు విడుదల 1
1/1

పులిచింతలకు 68,172 క్యూసెక్కులు విడుదల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement