బోల్తా కొట్టించిన అత్యవసర బ్రేకు | - | Sakshi
Sakshi News home page

బోల్తా కొట్టించిన అత్యవసర బ్రేకు

Oct 28 2025 8:02 AM | Updated on Oct 28 2025 8:02 AM

బోల్తా కొట్టించిన అత్యవసర బ్రేకు

బోల్తా కొట్టించిన అత్యవసర బ్రేకు

యడ్లపాడు రహదారిపై లారీ పల్టీ

డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

యడ్లపాడు: మండలంలోని 16వ జాతీయ రహదారిపై ప్రమాదవశాత్తు అదుపుతప్పి పక్కకు పడిపోయింది. దీంతో లారీ డ్రైవర్‌కు గాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం... బాపట్ల జిల్లా ఒంగోలు నుంచి అమరావతికి సబ్బుల్లో వినియోగించే కెమికల్‌ లోడుతో వెళ్తున్న లారీ యడ్లపాడు మండలంలోని ఎన్‌ఎస్‌ఎల్‌ నూలుమిల్లు వద్ద అదుపుతప్పి పక్కకు పడిపోయింది. వేగంగా వస్తున్న క్రమంలో డ్రైవర్‌ షడన్‌ బ్రేక్‌ వేయడంతో అదుపుతప్పి హైవేపై అడ్డంగా పడిపోయింది. మండలంలోని ఎన్‌ఎస్‌ఎల్‌ నూలుమిల్లు వద్ద సోమవారం తెల్లవారు జామున జరిగిన ఈ ప్రమాదంలో లారీ క్యాబిన్‌ నుజ్జునుజ్జుకాగా, డ్రైవర్‌కు తీవ్రంగా గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం గుంటూరు జీజీహచ్‌కు తరలించారు. లారీ బోల్తా పడటం వల్ల ఆ ప్రాంతంలో ఇతర వాహనాలకు ప్రమాదం జరగకుండా పోలీసులు ట్రాఫీక్‌ను మళ్లించారు. యుద్ధప్రాతిపదికన క్రేన్‌ను తెప్పించి వాహనాన్ని రహదారిపై అడ్డు లేకుండా తొలగించి రోడ్డుపై పడిపోయిన కెమికల్‌ బస్తాలను, ఇతర శిథిలాలను క్రేన్‌ సహాయంతో పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. నిత్యం వచ్చేపోయే వాహనాలతో రద్దీగా ఉండే రహదారిపై ప్రమాదం జరిగిన సమయంలో వాహనాలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని అంతా ఊపీరి పీల్చుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement