డాక్టర్‌ విజయకు డైమండ్‌ స్టేటస్‌ అవార్డు | - | Sakshi
Sakshi News home page

డాక్టర్‌ విజయకు డైమండ్‌ స్టేటస్‌ అవార్డు

Oct 28 2025 8:02 AM | Updated on Oct 28 2025 8:02 AM

డాక్టర్‌ విజయకు డైమండ్‌ స్టేటస్‌ అవార్డు

డాక్టర్‌ విజయకు డైమండ్‌ స్టేటస్‌ అవార్డు

గుంటూరు మెడికల్‌: ఇండియన్‌ స్ట్రోక్‌ అసోసియేషన్‌ జాతీయ అధ్యక్షురాలు, గుంటూరు లలితా సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ అధినేత, సీనియర్‌ న్యూరాలజిస్ట్‌ డాక్టర్‌ పమిడిముక్కల విజయకు అంతర్జాతీయ అవార్డు లభించింది. పక్షవాత రోగులకు ఉత్తమ చికిత్సకు గాను వరల్డ్‌ స్ట్రోక్‌ ఆర్గనైజేషన్‌ ఏజెంల్స్‌ ఇనిస్టిట్యూట్‌ డైమండ్‌ స్టేటస్‌ అవార్డు అందజేసింది. గతంలో నాలుగు పర్యాయాలు వరుసగా అవార్డు అందుకున్న డాక్టర్‌ విజయ నేడు ఐదోసారి కూడా అంతర్జాతీయ అవార్డు అందుకుని అరుదైన రికార్డు సృష్టించారు. సదస్సుకు ప్రపంచ వ్యాప్తంగా వంద దేశాలకు పైగా మూడువేల మంది న్యూరాలజిస్టులు, స్ట్రోక్‌ నిపుణులు పాల్గొన్నారు. వరల్డ్‌ స్ట్రోక్‌ కాంగ్రెస్‌ సదస్సు అక్టోబరు 22 నుంచి 24వ తేదీ వరకు స్పెయిన్‌లోని బార్సిలోనా నగరంలో జరిగింది. ఇండియన్‌ స్ట్రోక్‌ అసోసియేషన్‌, వరల్డ్‌ స్ట్రోక్‌ ఆర్గనైజేషన్‌ సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో డాక్టర్‌ విజయ ఆహ్వానిత స్పీకర్‌గా పాల్గొని మాట్లాడారు. భారత దేశంలోని ప్రతి జిల్లాలో ఒక స్ట్రోక్‌ యూనిట్‌ ఏర్పాటు, అందుకు ఏర్పడే సవాళ్లు, వాటి పరిష్కారాలు అనే అంశంపై మాట్లాడారు. భారత దేశంలో పెరుగుతున్నర పక్షవాత భారం, అత్యవసర వైద్య సదుపాయాలు బలోపేతం చేయాల్సిన ఆవశ్యకతపై చర్చించారు. ఆర్టీఫీషియల్‌ ఇంటిలిజెన్స్‌ ఆధారిత స్కానింగ్‌ సూస్‌ ద్వారా వ్యాధి నిర్ధారణలో కచ్చితత్వం మెరుగు పడుతుందని డాక్టర్‌ విజయ పేర్కొన్నారు.

వరుసగా ఐదో సారి అవార్డుకు ఎంపిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement