దిగుబడి, ధరలు తగ్గాయి
నేను నాలుగు ఎకరాల్లో పత్తి సాగు చేశాను. వర్షాలు అధికంగా కురవడంతో గూడు, పిందే రాలిపోయాయి. ఎకరాకు 15 క్వింటాళ్ల వరకు వస్తుందనుకున్న దిగుబడి కనీసం ఐదారు క్వింటాళ్లు కూడా వచ్చేలా లేదు. మరోవైపు దళారులు ధరలను అమాంతం తగ్గించేశారు. నాణ్యమైన పత్తి క్వింటాల్ రూ.5 వేలకు అడుగుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి క్వింటాల్ పత్తి కనీసం 8 వేలకు అమ్ముకొనేలా చర్యలు తీసుకోవాలి.
–బోనం నాగిరెడ్డి,
రైతు, కోగంటివారిపాలెం, అచ్చంపేట.
నేను రెండెకరాలు కౌలుకు తీసుకొని అందులో ఈ ఖరీఫ్‌లో పత్తి సాగు చేశాను. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు పత్తి పంటలు కింద కాపు మొత్తం కుళ్లిపోయింది. తేమ అధికంగా ఉండటంతో పూత పిందే విపరీతంగా రాలిపోతుంది. ఆకులు పండుటాకులవుతున్నాయి. పత్తి చెట్లు భారీగా పెరగటంతో రెండు పర్యాయాలు కొమ్మ కొట్టాను. పంట మొత్తం కమ్ముకుపోవటం భూమిలో తడి ఆరకపోవటంతో కాసిన కాపు కూడా పుచ్చిపోతుంది. మరింత వర్షాలు పడితే పంటను వదిలేసుకునే పరిస్థితి ఏర్పడింది.
– చింతా బత్తిన బుజ్జిబాబు,
పత్తి రైతు, పెదకూరపాడు
దిగుబడి, ధరలు తగ్గాయి


