రైలు కింద పడి యువకుడి ఆత్మహత్య
పిడుగురాళ్ల: పిడుగురాళ్ల పట్టణంలోని బైపాస్ రోడ్డు సమీపంలోని రైల్వే ట్రాక్‌పై ఓ యువకుడి మృతదేహాన్ని గురువారం గుర్తించారు. జీఆర్‌పీ ఇన్‌చార్జి ఎస్‌ఐ రాజమోహన్‌రావు తెలిపిన వివరాల మేరకు... మాచవరం మండలం కొత్తగణేశునిపాడు గ్రామానికి చెందిన తుపాకుల తేజ(25) బుధవారం రాత్రి ఏడు గంటల సమయంలో రైల్వే పట్టాలపై ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చని తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతుడి వివరాలు తెలుసుకొని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. ఆత్మహత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సత్తెనపల్లి ప్రభుత్వ వైద్యశాలకు తరలించినట్లు జీఆర్‌పీ ఇన్‌చార్జి ఎస్‌ఐ రాజమోహన్‌రావు తెలిపారు.


