సమస్యలకు నిలయం కేజీబీవీ
పనిచేయని ఆర్వో వాటర్ ప్లాంట్ తాగేందుకు బోరు నీరే శరణ్యం గదులలో పనిచేయని ఫ్యాన్లు ఉక్కపోతతో విద్యార్థినుల అవస్థలు రుచి లేని భోజనం అర్ధాకలితో అలమటిస్తున్న విద్యార్థినులు పనిచేయని సోలార్ ప్లాంట్
బాలికలవి ఆరోపణలు మాత్రమే
కేజీబీవీలో అన్నీ సమస్యలే
బొల్లాపల్లి: బొల్లాపల్లిలోని కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయం(కేజీబీవీ) సమస్యలకు నిలయంగా మారింది. ఆర్వో వాటర్ ప్లాంట్ అలంకారప్రాయంగా మారింది. బోరు నీరే దిక్కు అయ్యింది. గదులలో ఫ్యాన్లు పనిచేయడం లేదు. విద్యార్థినులు ఉక్కపోతతో అల్లాడుతున్నారు. విద్యార్థినులే స్వయంగా గదులను శుభ్రపరచుకుంటున్నట్లు సమాచారం. సోలార్ ప్లాంట్ ఉన్నా పనిచేయదు, కరెంటు పోతే అంధకారం నెలకొంటుంది. కంప చెట్లు పెరిగి విషపురుగులు సంచరిస్తుంటాయి. వీటికితోడు ఆరేళ్లుగా విధులు నిర్వహిస్తున్న ప్రత్యేక అధికారికి బోధన, బోధనేతర సిబ్బందికి మధ్య సఖ్యత లేదని తెలిసింది. సమన్వయలోపంతో బోధన అంతంత మాత్రంగానే సాగుతున్నట్లు సమాచారం. మండల కేంద్రంలోని కేజీబీవీలో 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు 240 మంది విద్యార్థినులు విద్య నభ్యసిస్తున్నారు. వీరిలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన వారే అధికం. ఒకరిద్దరూ ఉపాధ్యాయునిలు నామమా త్రంగా తరగతులకు హాజరవుతారని బాలికలు చెప్తున్నారు. సమస్యలపై మాట్లాడితే చర్య ఉంటుందని బాలికలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఎస్‌ఓకి బోధన బోధనేతర సిబ్బందికి మధ్య సమన్వయలోపంతో, విద్యాలయంలో మౌలిక వసతులు, గురించి పట్టించుకోకపోవడంతో సమస్యలు తిష్ట వేశాయని బాలికల తల్లిదండ్రులు చెప్తున్నారు. మారుమూల ప్రాంతం కావడంతో ఇప్పటివరకు జిల్లా, ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేదని, దీంతో కేజీబీవీలో సమస్యల గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. కోటిన్నరతో అదనంగా భవనాలు కట్టుబడి చేస్తున్నారు కానీ మౌలిక వసతులు కల్పించడంలో విఫలమయ్యారు. ప్రవేశ ద్వారం వద్ద మురుగు చేరి దుర్వాసన వెదజల్లు తుంది. వాటర్ ట్యాంక్ వద్ద అపరిశుభ్రత వలన ఇటీవల ఓ ఉపాధ్యాయునిరాలు ప్రమాదానికి గురై గాయాలపాలయ్యారు. పలుమార్లు సమస్యలను, ప్రత్యేక అధికారుల దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోవడంలేదని బాలికల తల్లిదండ్రులు వాపోతున్నారు. ఇప్పటికై నా విద్యాలయంలో తిష్ట వేసిన సమస్యలపై ఉన్నతాధికారులు దృష్టి సారించి, మౌలిక వసతులు కల్పించి, సమస్యలను పరిష్కరించాలని, నిరుపేద బాలికలకు మెరుగైన విద్యా బోధనతోపాటు నాణ్యత రుచికరమైన భోజనం అందేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థినిల తల్లిదండ్రులు కోరుతున్నారు.
ఆరేళ్లుగా ఇక్కడే విధులు నిర్వహిస్తున్నాను. పిల్లలను తల్లిదండ్రులతో ఇళ్లకు పంపడం లేదని మాపై నిందలు వేస్తున్నారు. ఆర్వో వాటర్ ప్లాంట్ పనిచేయదు, ఇక్కడ బోరు నీరు తాగుతున్నారు. వాటర్ ప్లాంట్ మరమ్మతులు చేపడితే రూ.10 వేలు ఖర్చు అవుతుందని, తిరిగి మరలా రిపేర్‌కు వస్తుందని మెకానిక్ చెప్పాడు. విద్యార్థులను అడిగితే భోజనం బాగానే ఉందని చెప్తున్నారు.
– వి లీలావతి, ఎస్‌ఓ, కేజీబీవీ
కేజీబీవీలో అన్నీ సమస్యలే. ఇక్కడ నిరుపేదలకు చెందిన పిల్లలు అధికంగా చదువుకుంటున్నారు. మౌలిక వసతులు లోపించాయి. ప్రధానంగా జిల్లా అధికార యంత్రం పట్టించుకోకపోవడంతో, ఇక్కడ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. పలుమార్లు వారి దృష్టికి తీసుకు వెళ్లినా ఫలితం లేదు. ఇప్పటికై నా సమస్యలపై ఉన్నతాధికారులు దృష్టి సారించాలని కోరారు. కేజీబీవీలో సమస్యలపై పిల్లలు తల్లిదండ్రులకు చెబితే లోపల బెదిరిస్తున్నారని పిల్లలు చెప్తున్నారు. దీనిపైన తగు చర్యలు తీసుకోవాల్సి ఉంది. – బి రామాంజి నాయక్, పేరెంట్
సమస్యలకు నిలయం కేజీబీవీ
సమస్యలకు నిలయం కేజీబీవీ


