ఎరువుల కొరత లేకుండా చూడండి
మంత్రి గొట్టిపాటి రవికుమార్
బల్లికురవ: రైతులకు ఇబ్బందులు లేకుండా ఎరువులు అందించాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. అద్దంకి నియోజకవర్గ వ్యవసాయ సిబ్బందితో ఎరువులపై గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ అద్దంకి, పర్చూ రు నియోజకవర్గాలకు రబీ సీజన్‌లో డీఏపీ ఎక్కువ అవసరం ఉంటుందని కొరత లేకుండా రైతులకు అందించాలని వ్యవసాయ కమిషనర్ మంజీర్ జిలానీకి సూచించారు. జిల్లా వ్యవసాయాధికారి ఎం.సుబ్రహ్మణ్యేశ్వరరావు, అద్దంకి, మార్టూరు సహాయ వ్యవసాయ సంచాలకులు బి.ఎఫ్రాయిం, సుదర్శనరాజు, నియో జకవర్గ వ్యవసాయాధికారులు వెంకటకృష్ణ, రామ్‌మోహన్‌రెడ్డి, సుబ్బారెడ్డి, శ్రీనివాసరావు, షేక్ సైదా, వెంకటరామయ్య పాల్గొన్నారు.
చీరాల: వృద్ధుడైన తన భర్త కనిపించడం లేదంటూ భార్య గురువారం చీరాల వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాలు...చీరాల మసీదు సెంటర్‌లో నివాసం ఉంటున్న జొన్నాదుల కాంతమ్మ తన భర్త రామమూర్తి (70) మూడు రోజుల నుంచి కనిపించడం లేదని ఫిర్యాదులో పేర్కొంది. మతి స్థి మితం సరిగా లేదని, మూడు రోజుల నుంచి కని పించలేదని, పలుచోట్ల గాలించినా కనిపించకపోవడంతో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేశారు.


