
ఫిర్యాదులను సత్వరం పరిష్కరించాలి
బ్యాంకులో బంగారం బయటకు తీశారు..
●ఎస్పీ కృష్ణారావు
●జిల్లా పోలీసు కార్యాలయంలో పీజీఆర్‌ఎస్
నరసరావుపేట రూరల్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఫిర్యాదులను సత్వరం పరిష్కరించాలని జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. కుటుంబ, ఆర్థిక, ఆస్తి వివాదాలు, మోసం వంటి 127 ఫిర్యాదులు అందాయి. అదనపు ఎస్పీ(అడ్మిన్) జేవీ సంతోష్, మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ ఎం.వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
పట్టణంలోని ఐసీఐసీఐ బ్యాంక్‌లో 76.80 గ్రాముల బంగారం పెట్టి రూ.1.90 లక్షలు రుణం తీసుకున్నా. నెల క్రితం డబ్బులు చెల్లించి బంగారాన్ని తీసుకునేందుకు వెళ్లా. బ్యాంక్‌కు వెళ్లగా బంగారం తీసినట్టుగా ఉంది. దీనిపై మేనేజర్‌ను ప్రశ్నించగా లెడ్జర్ బుక్ తెప్పించి పరిశీలించగా సంతకం తనది కాదని తేలింది. దీనిపై మేనేజర్‌ను పలు మార్లు కోరినా పట్టించుకోవడం లేదు. నాకు న్యాయం చేయాలి.
– షేక్ కరీమున్, చిలకలూరిపేట