
ఆందోళనతోనే ‘తల్లికి వందనం’
కార్యక్రమంలో డాక్టర్ గోపిరెడ్డి మాట్లాడుతూ తనకు జిల్లా కార్యనిర్వాహక అధ్యక్ష పదవి నియోజకవర్గంలోని కార్యకర్తలను చూసి ఇచ్చారని అన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఏడు నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీ గెలుపొందేలా ఉత్సాహంగా పనిచేయాలని కోరారు. పార్టీ కోసం పనిచేసే వారిని గుర్తుపెట్టుకుంటామని హామీ ఇచ్చారు. కేసులకు ఎవరూ భయపడాల్సిన పనిలేదని.. అవసరమైతే పార్టీ కోసం జైలుకు వెళతానని అన్నారు. వెన్నుపోటు దినం పాటించటం వలనే చంద్రబాబు తల్లికి వందనం కొంతవరకు అమలు చేశారని పేర్కొన్నారు. ఇతర హామీలు అమలు కాని తీరును ప్రజలకు వివరించాలన్నారు.