
అధికారం అండగా
మైనింగ్ క్వారీలు నడపాలంటే మైనింగ్ శాఖ, పర్యావరణ(ఈసీ), కాలుష్య నియంత్రణ మండలితోపాటు సీఎఫ్‌ఈ, సీఎఫ్‌వో వంటి అనుమతులు తీసుకోవాలి. ఆ తర్వాత రవాణాకు సంబంధించిన పర్మిట్లు తీసుకుని, తవ్విన ఖనిజం తరలించాలి. కానీ ఇవేమి లేకుండానే అధికార పార్టీ నేతల అండదండలతో కొండలు, గుట్టలను గుట్టు చప్పుడు కాకుండా తవ్వేస్తున్నారు. ప్రభుత్వ ఆదాయానికి భారీ నష్టాన్ని కలిగించడమే కాకుండా, పర్యావరణ విపత్తుకు ఇది దారితీస్తోంది.
యడ్లపాడు:యడ్లపాడు మండలం వంకాయలపా డు రెవెన్యూ పరిధిలోని ఉప్పరపాలెంలో అక్రమ మెటల్ క్వారీయింగ్‌పై గ్రామస్తులు ఇటీవల ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ప్రమాద హెచ్చరికలు తెలిపే భద్ర తా బోర్డులు, ఫెన్సింగ్ లేకుండా కొండలు తవ్వడంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారీ బ్లాస్టింగ్‌తో నివాసాలపై రాళ్లుపడుతున్నాయని, పర్యావరణం, భూగర్భ జలాలు కలుషితం అవుతున్నాయని, దుమ్ముధూళితో పంట పొలాలు పాడవ్వతున్నాయని, క్వారీ గుంతల్లో వర్షపు నీరు నిలిచి ప్రజలు, పశువులు ప్రమాదాల బారినపడే పడుతున్నారని, భారీ లోడు వాహనాల కారణంగా రోడ్లు ధ్వంసమవుతున్నాయంటూ స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఫిర్యాదుతో అధికారుల్లో చలనం
ఉప్పరపాలెం గ్రామస్తుడు గుంజి శ్రీనుతోపాటు మరికొందరు కలెక్టర్‌కు గతనెల 26న ఫిర్యాదు చేశా రు. ఈ నేపథ్యంలో ఈనెల రెండో తేదీన నరసరావుపేట ఆర్డీఓ మధులత క్షేత్రస్థాయి విచారణకు ఉప్పరపాలెం వచ్చారు. కొండల్లో ఉన్న లీజుదారుల క్వారీలన్నీంటిని సమగ్ర సర్వే చేయాలంటూ ఆదేశించారు. దీంతో మూడు రోజులపాటు మైనింగ్, రెవెన్యూ, పంచాయతీ, పోలీసుశాఖల అధికారులు, గ్రామస్తుల సమక్షంలో కొలతలు చేపట్టారు. అనేక అక్రమ క్వారీయింగ్ విషయాలు బయటపడ్డాయి.
క్వారీలు 26..అనుమతులు నాలుగింటికే..
మండలం పరిధిలోని విశ్వనాథుని కండ్రిక, మైదవోలు, వంకాయలపాడు రెవెన్యూ కొండల్లో మొత్తం 37 క్వారీలు ఉన్నాయి. వీటిలో యడ్లపాడు–11, ఉప్పరపాలెం–26 క్వారీ లీజులున్నాయి. గతంలో ఉన్న క్వారీ లీజులు మైదవోలు–3, యడ్లపాడు–1 రద్దు కాగా, వాటికి బదులుగా యడ్లపాడు–1, ఉప్పరపాలెం–3 కొత్త లీజుదారులు వచ్చారు. ఈ నేపథ్యంలో ఉప్పరపాలెం గ్రామంలోని సర్వే నంబర్ 240/10 పరిధిలో ఉన్న 26 లీజుల్లో 4 క్వారీలకు మాత్రమే అన్ని అనుమతులు ఉన్నట్లు తాజాగా ఉమ్మడి శాఖల అధికారుల విచారణలో వెలుగుచూసింది.
మండలంలో మొత్తం 37 క్వారీలు అనుమతులు లేనివే అత్యధికం కంకర క్వారీల్లో నిబంధనల ఉల్లంఘన అధికార పార్టీ నేతల అండదండలు తవ్వకాలు ఆపాలంటూ ఉప్పరపాలెం గ్రామస్తుల వేడుకోలు కలెక్టర్ ఆదేశాలతో క్వారీల్లో సమగ్ర తనిఖీలు అక్రమ మైనింగ్‌తో ప్రభుత్వానికి భారీ నష్టం
ప్రభుత్వ ఆదాయానికి గండి ఇలా...
క్వారీల్లోని బండరాళ్లను టిప్పర్లలో స్టోన్ క్రషర్లకు తరలించి 12 ఎంఎం, 20ఎంఎం, 40 ఎంఎం సైజుల్లో ముక్కలుగా మారుస్తారు. రాతి డస్డ్‌గా ప్రాసెసింగ్ చేసుకుని వాటిని విక్రయించుకుంటారు. ఒక రోజుకు స్థానిక సుమారు రూ.12 లక్షల విలువైన 800 యూనిట్లు కంకర, 100 లారీలు డస్ట్ విక్రయాలు జరుగుతున్నటు్‌ల్ స్థానికులు చెబుతున్నారు. మామూళ్ల వసూళ్లు, నేతల సిఫార్సులతో రాయల్టీ రూపంలో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి ఇలా గండి పడుతుంది.

అధికారం అండగా

అధికారం అండగా