
అన్నివర్గాలను మోసం చేసిన బాబు
గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కూటమి ఏడాది పాలనపై తీవ్ర వ్యతిరేకత మొదలైందని చంద్రబాబుకు తెలుసునని అన్నారు. పెదకూరపాడు నియోజకవర్గంలో ఈదా సాంబరెడ్డిని కాపు కాచి నడిరోడ్డు మీద రెండు కాళ్లు విరగొట్టటం దుర్మార్గమని అన్నారు. అక్రమంగా కేసులు పెట్టే పోలీసులపై చర్యలు తప్పవన్నారు. తల్లికి వందనం లోకేష్ మదిలో నుండి వచ్చిందని చెప్పటం చంద్రబాబు మోసాలకు నిదర్శనమన్నారు.
పెదకూరపాడు: ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన మోసాన్ని ఇంటింటికి వివరించాల్సిన బాధ్యత వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై ఉందని ముఖ్యనేతలు పేర్కొన్నారు. గత వైఎస్. జగన్‌మోహన్‌రెడ్డి పాలన నేడు చంద్రబాబు పాలనను బేరీజు వేసుకునేలా ప్రజల్లో అలోచింప చేయాలన్నారు. బాబు ష్యూరిటీ,–మోసం గ్యారంటీ, రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమం పెదకూరపాడు నియోజకవర్గంలోని క్రోసూరు పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ పెదకూరపాడు నియోజకవర్గ ఇన్‌చార్జి నంబూరు శంకరరావు ఆధ్వర్యంలో శనివారం నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైఎస్సార్ సీపీ క్రోసూరు మండల అధ్యక్షుడు వెలది అప్పారావు అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథులుగా వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా పరిశీలకులు, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి, పల్నాడు జిల్లా పరిశీలకులు డాక్టర్ పూనూరు గౌతంరెడ్డి, బాపట్ల జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి మేరుగ నాగార్జున, వైఎస్సార్ సీపీ పల్నాడు జిల్లా కార్యనిర్వహక అధ్యక్షుడు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు చెన్నప్పరెడ్డి వెంకటేశ్వరెడ్డి, కొండవీటి కోటేశ్వరరావు, కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ మంగిశెట్టి కోటేశ్వరరావు, జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు షేక్ హష్మి, జెడ్పీటీసీ సభ్యులు వెంకటరెడ్డి, షేక్ జమీలా గఫూర్, కంకణాల స్వర్ణకుమారి, ప్రతాప్‌రెడ్డి, క్రోసూరు యార్డు మాజీ చైర్మన్ ఈదా సాంబిరెడ్డి, ఎంపీపీలు బెల్లంకొండ మీరయ్య, పి.కోటయ్య, చెన్నప్పరెడ్డి పద్మా వెంకటేశ్వరెడ్డి, పార్టీ మండల అధ్యక్షులు చిలకా చంద్రయ్య, నర్సిరెడ్డి, భవిరిశెట్టి హనుమంతరావు, వివిధ విభాగాల నాయకులు పాల్గొన్నారు.
నంబూరు శంకరరావు మాట్లాడుతూ జగనన్న నవరత్నాల గురించి ప్రజలకు చెప్పుకునే దమ్ము, ధైర్యం మాకుందన్నారు. కూటమి ఏడాది పాలనలో చేసిందేమీ లేదని, సుపరిపాలన గురించి చెప్పుకోవటానికి ఇళ్లకు వెళ్లేందుకు కూడా భయపడుతున్నారు. తనపై వస్తున్న ఆరోపణలు నమ్మవద్దని, పెదకూరపాడు అభివృద్ధి ఆశయంగా పని చేస్తానని అన్నారు. రాబోయే రోజుల్లో తాను హామీ ఇచ్చిన అమరావతి–బెల్లంకొండ రోడ్డు, ఎత్తిపోతల పథకాలు పూర్తి చేస్తానని అన్నారు.
మోదుగుల వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంబ్రాబునాయుడు చేసిన మోసాలను చూసి ఎన్టీఆర్ విగ్రహం తలదించుకుంటుందన్నారు. పెదకూరపాడు నియోజకవర్గ అభివృద్ధి కోసం శంకరరావు నిరంతరం కృషి చేశాడన్నారు. అమరావతి బెల్లంకొండ రహదారికి శంకరరావు రోడ్డు అని నామకరణం చేయాల్సిందేనని అన్నారు.
మేరుగ నాగార్జున మాట్లాడుతూ చంద్రబాబు సూపర్ సిక్స్ పేరుతో ఇచ్చిన 145 వాగ్దానాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. దళిత బిడ్డలపై అత్యాచారాలు జరుగుతున్నా పట్టించుకోవటం లేదన్నారు. రాజ్యాంగాన్ని ఖూని చేసే విధంగా రెడ్‌బుక్ పాలన నడుస్తుందన్నారు.
గౌతంరెడ్డి మాట్లాడుతూ 20 లక్షల ఉద్యోగాలిస్తానన్నావ్.. నిరుద్యోగ భృతి రూ.3వేలు ఇస్తానన్నావ్..ఎక్కడిచ్చావు బాబూ అని ప్రశ్నించారు. జగన్ ముఖ్యమంత్రి అయిన ఏడాదికే నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చారన్నారు.
కూటమి పాలనపై వ్యతిరేకత
వైఎస్సార్ సీపీ నేతలు సీఎం మోసాలను ఇంటింటికి తీసుకెళ్లాలి పెదకూరపాడు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం
నవ రత్నాలు మావి..
నియోజకవర్గ అభివృద్ధికి నంబూరు కృషి
రాష్ట్రంలో రెడ్‌బుక్ పాలన
నిరుద్యోగ భృతి ఏమైంది?

అన్నివర్గాలను మోసం చేసిన బాబు

అన్నివర్గాలను మోసం చేసిన బాబు

అన్నివర్గాలను మోసం చేసిన బాబు

అన్నివర్గాలను మోసం చేసిన బాబు

అన్నివర్గాలను మోసం చేసిన బాబు

అన్నివర్గాలను మోసం చేసిన బాబు