
ప్రతిపక్షాన్ని భూస్థాపితం చేస్తాననడం అవివేకం
పిడుగురాళ్ల: రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న చంద్రబాబు నాయుడు జగన్ భూతాన్ని భూస్థాపితం చేస్తాం అనటం అవివేకమని గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం కాసు మహేష్ రెడ్డి విడుదల చేసిన వీడియోలో మాట్లాడుతూ రాజకీయాల్లో ప్రజా తీర్పుకు మించింది ఏదీ లేదని, జగన్ మోహన్ రెడ్డి అనే భూతాన్ని భూస్థాపితం చేస్తాం అనడం ఆయన రాజకీయ అనుభవానికి పరాకాష్ట అన్నారు. ఇక టీడీపీనే 15 సంవత్సరాల పాటు అధికారంలో ఉంటుందనడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. పొత్తులతో తప్పితే చంద్రబాబు నాయుడు ఒంటరిగా పోటీ చేయడం చేతకాదని విమర్శించారు. ప్రజలకు హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలు అందించకుండా ప్రజలకు మోసం చేస్తున్నారు. నిరుద్యోగులకు ఇస్తానన్న నిరుద్యోగ భృతి అందించలేదని, ప్రతి మహిళకు నెలకు రూ.1500 చొప్పున ఇస్తామన్నారు.. అదీ ఇవ్వలేదన్నారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ ఇవ్వకుండా మోసం చేస్తున్న చంద్రబాబు నాయుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజల గుండెల్లో చెరగని ముద్రగా ఉన్న ప్రజా నేత జగన్ మోహన్ రెడ్డిని భూస్థాపితం చేస్తాననడం దుర్మార్గమన్నారు. రాజకీయాల్లో ప్రత్యర్థులపై విమర్శించడం సాధారణమే కానీ చంద్రబాబుకు ఎందుకో తెలియదు కానీ జగన్ మోహన్ రెడ్డి అంటే ప్రత్యేకమైన కోపం దాని ప్రభావం వల్లే ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారని ఈ సందర్భంగా కాసు మహేష్ రెడ్డి మండిపడ్డారు.
ప్రాణం తీసిన అక్రమ మట్టి తరలింపు!
కరెంటు స్తంభాన్ని ఢీకొని
ట్రాక్టర్ డ్రైవర్ మృతి
వినుకొండ: టీడీపీ నేతల అక్రమ మట్టి తరలింపులో ఓ నిండు ప్రాణం బలైంది. వినుకొండ రూరల్ మండలం దొండపాడు సమీపంలో మునిస్వామి కొండ ప్రాంతం నుంచి అక్రమంగా మట్టి తరలిస్తుండగా ట్రాక్టర్ పానకాల సమీపంలో విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. ఈప్రమాదంలో పానకాలపాలెం గ్రామానికి చెందిన ఎం.నాసరయ్య (48) ట్రాక్టర్ డ్రైవర్ విద్యుత్ స్తంభం విరిగి మీదపడి విద్యుత్ షాక్‌కు గురై మృతిచెందాడు. ప్రతిరోజూ వందల సంఖ్యలో వాహనాల ద్వారా రూ. కోట్ల విలువ చేసే మట్టిని అక్రమంగా తరలించడం పరిపాటిగా మారింది. ఈవిషయమై ఈనెల 23న ‘సాక్షి’ పత్రికలో అక్రమంగా మట్టి తరలిస్తున్నారంటూ కథనాన్ని ప్రచురించినప్పటికీ దీనిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అక్రమ మైనింగ్‌ను ఆపకుండా వదిలేయడం వల్లే ఈప్రమాదంలో డ్రైవర్ మృతికి కారణమైందని పలువురు వాపోతున్నారు. సంఘటనా స్థలంలో ట్రాక్టర్ రోడ్డుకు అడ్డంగా పడడంతో అక్రమంగా మట్టి తరలిస్తున్న మరో పది ట్రాక్టర్లు నిలిచిపోయాయి. గత్యంతరం లేక వెనుదిరిగి వెళ్లిపోయారు. మృతుడికి భార్య లక్ష్మి ఉన్నారు.
గుండెపోటుతో
వలస కార్మికుడి మృతి
నర్సంపేట రూరల్: గుండెపోటుతో వలస కార్మికుడు మృతి చెందాడు. ఈ ఘటన వరంగల్ జిల్లా నర్సంపేటలోని ఓ లాడ్జిలో శుక్రవారం చోటుచేసుకుంది. పల్నాడు జిల్లా గురజాలకు చెందిన చలవాది రాంబాబు (44) నర్సంపేటకు 20 రోజుల కిందట వలస వచ్చాడు. స్థానిక బస్టాండ్ సమీపంలోని ఓ హోటల్‌లో బిర్యానీ మాస్టర్‌గా పని చేస్తూ లాడ్జిలోని ఓ గదిలో ఉంటున్నాడు. గురువారం రాత్రి హోటల్‌లో పని ముగించుకుని లాడ్జికి చేరుకున్న రాంబాబు శుక్రవారం ఉద యం పనికి వెళ్లకపోవడంతో హోటల్ సిబ్బంది వచ్చి చూడగా అచేతనంగా పడి ఉన్నాడు. లాడ్జి నిర్వాహకుల సమాచారంతో పోలీసులు చేరుకుని విచారణ చేపట్టారు.
పవర్ లిఫ్టింగ్ ఓవరాల్
చాంపియన్ లక్ష్మి
చీరాల రూరల్: జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో సమరోతు లక్ష్మి, ఓవరాల్ చాంపియన్ షిప్ సాధించింది. బాపట్ల జిల్లా చీరాలకు చెందిన లక్ష్మి, గుంటూరు జిల్లా తాడికొండలో డిగ్రీ చదువుతోంది. రాష్ట్ర జట్టు తరఫున కర్ణాటక రాష్ట్రంలో ఈనెల 22 నుంచి 30వ తేదీ వరకు నిర్వహిస్తున్న జాతీయస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొంది.
జగన్ అంటే చంద్రబాబుకు ఎనలేని కోపం గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి

ప్రతిపక్షాన్ని భూస్థాపితం చేస్తాననడం అవివేకం

ప్రతిపక్షాన్ని భూస్థాపితం చేస్తాననడం అవివేకం

ప్రతిపక్షాన్ని భూస్థాపితం చేస్తాననడం అవివేకం