ఎర్ర బంగారంగా పిలుచుకునే మిర్చిని సిరుల పంటగా విశ్వసిస్తారు. అయితే కూటమి సర్కారు తీరుతో ఈ ఏడాది మిర్చి రైతుకు ఘాటు తగిలింది.. ఫలితంగా నేడు జిల్లాలో మిర్చి సాగు చేసిన ఏ ఒక్క రైతు ఇంట ఆనందం లేదు. ధర పతనంతో రైతు కుదేలు కాగా.. ఆదుకుని ‘మద్దతు’గా నిలవాల్సిన ప్ | - | Sakshi
Sakshi News home page

ఎర్ర బంగారంగా పిలుచుకునే మిర్చిని సిరుల పంటగా విశ్వసిస్తారు. అయితే కూటమి సర్కారు తీరుతో ఈ ఏడాది మిర్చి రైతుకు ఘాటు తగిలింది.. ఫలితంగా నేడు జిల్లాలో మిర్చి సాగు చేసిన ఏ ఒక్క రైతు ఇంట ఆనందం లేదు. ధర పతనంతో రైతు కుదేలు కాగా.. ఆదుకుని ‘మద్దతు’గా నిలవాల్సిన ప్

Jun 27 2025 4:21 AM | Updated on Jun 27 2025 4:21 AM

ఎర్ర

ఎర్ర బంగారంగా పిలుచుకునే మిర్చిని సిరుల పంటగా విశ్వసిస్

సాక్షి, నరసరావుపేట: మిర్చి పంట సాగుకు రైతులు వెనుకాడుతున్నారు. గతంలో సిరులు పండించిన మిరపసాగుకు నేడు కనీసం పెట్టుబడి కూడా దక్కడం లేదు. దీంతో పల్నాడు రైతులు మిరప పంట వైపు వెళ్లడానికి ఆలోచిస్తున్నారు. ఫలితంగా ఈ ఏడాది మిర్చి సాగు అమాంతం పడిపోనుందని అధికారులు భావిస్తున్నారు. వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులు ఖరీఫ్‌లో జిల్లావ్యాప్తంగా 57 వేల హెక్టార్లలో మిర్చి సాధారణ సాగుగా ప్రకటించినప్పటికి కనీసం 35 వేల హెక్టార్లలో సాగు కూడా కష్టమేనని అభిప్రాయపడుతున్నారు. గతేడాది ఖరీఫ్‌లో మిరప పంట సాగు చేసిన రైతులకు పెట్టుబడి రాకపోగా రూ.లక్షల్లో నష్టపోయారు. ఓ వైపు తెగులు సోకడం, మరోవైపు పెట్టుబడి ఖర్చు అమాంతం పెరిగడంతోపాటు దిగుబడి తగ్గింది. అరకొర వచ్చిన మిర్చిపంటను అమ్ముకుందామంటే ధరలు గతంలో ఎన్నడూలేనివిధంగా పతనం అవ్వడంతో తీవ్ర ఇబ్బంది ఎదురైంది. కొందరు రైతులకు పెట్టుబడి కాదుకదా కనీసం కూలీ, రవాణా ఖర్చులు కూడా రాని దుస్థితి.

మిరప విత్తనాలకు డిమాండ్‌ నిల్‌

వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ఖరీఫ్‌ వ్యవసాయ కార్యక్రమాలు మందకొడిగా నడుస్తున్నాయి. వర్షాలు పూర్తిస్థాయిలో కురవకపోవడంతో పగటి ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటున్నా యి. దీంతో నారుపోయడానికి రైతులు వెనుకాడుతు న్నారు. సాధారణంగా మే చివరి నుంచి జిల్లాలోని నర్సరీలలో మిరప నారు విత్తనాలు వేస్తారు. అయితే ప్రస్తుతం రైతులు మిర్చిసాగుకు వెనుకాడుతుండటంతో నర్సరీలు బోసిపోతున్నాయి. మరోవైపు గతంలో మిర్చి విత్తనాలకు విపరీతమైన డిమాండ్‌ ఉండేది. బహిరంగ మార్కెట్‌లో వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి ధరలను అమాంతం పెంచి రైతులను దోపిడీ చేసేవారు. అయితే ఈ ఏడాది మిర్చి విత్తనాలకు ఏమాత్రం డిమాండ్‌ లేక వ్యాపారాలు సాగడంలేదని వ్యాపారులు వాపోతున్నారు. ఈ ఏడాది జిల్లాలో సుమారు 1.52 లక్షల 10 గ్రాముల మిర్చి విత్తనాల ప్యాకెట్లు అవసరమని అధికారులు లెక్కకట్టారు. మరోవైపు రైతులు మిర్చి పంట సాగు వదలి ప్రత్యామ్నాయ పంటల వైపు చూస్తున్నారు. పత్తి, బొప్పాయి, కూరగాయలు, పండ్లతోటల వైపు ఆలోచిస్తున్నారు.

మిరప విత్తనాలు కొనేవారే లేరంటున్న వ్యాపారులు ఇప్పటివరకు మిర్చి నారు పోయని నర్సరీ యజమానులు గతేడాది భారీ నష్టాన్ని మిగిల్చిన పంట ధరలు అమాంతం పతనమైనా పట్టించుకోని కూటమి ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటల వైపు రైతుల చూపు జిల్లాలో 57 వేల హెక్టార్లలో సాగు అంచనా వేసిన ఉద్యాన శాఖ అధికారులు

ఎర్ర బంగారంగా పిలుచుకునే మిర్చిని సిరుల పంటగా విశ్వసిస్1
1/1

ఎర్ర బంగారంగా పిలుచుకునే మిర్చిని సిరుల పంటగా విశ్వసిస్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement