మహిళ శరీరంలో బ్లేడ్...
కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స కోసం నరసరావుపేట పాత ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన మహిళ శరీరంలో బ్లేడు పెట్టి కుట్లు వేసిన దారుణమైన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నరసరావుపేట బాలయ్యనగర్‌కు చెందిన టి రమాదేవి గత నెల 26వ తేదీ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోసం వైద్యశాలలో చేరింది. ఆపరేషన్ చేసిన వైద్యులు ఆమె శరీరంలో బ్లేడ్‌ను వదిలేసి కుట్లు వేశారు. వైద్యుల నిర్లక్ష్యానికి ఈ సంఘటన పరాకాష్టగా మారింది. శస్త్రచికిత్స గదిలో మౌలిక జాగ్రత్తలు తీసుకోకుటే రోగుల ప్రాణాలకు గ్యారెంటీ ఏంటన్న ప్రశ్నలు తలెత్తాయి. ఈ వ్యవహారంపై మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి స్పందించి ఉచితంగా సర్జరీ చేసి బ్లేడ్‌ను తొలగించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రభుత్వ వైద్యుడిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు.


