ఉపాధి పనుల్లో లోపాలు | - | Sakshi
Sakshi News home page

ఉపాధి పనుల్లో లోపాలు

Jun 25 2025 6:56 AM | Updated on Jun 25 2025 6:56 AM

ఉపాధి

ఉపాధి పనుల్లో లోపాలు

రికవరీలకు డ్వామా పీడీ సిద్ధలింగమూర్తి ఆదేశాలు

యడ్లపాడు: ఉపాధి హామీ పథకం కింద నిర్వహించిన పనులపై 17వ విడత సామాజిక తనిఖీ నివేదికను ప్రతిపాదిస్తూ ఎంపీడీవో కార్యాల యం వద్ద మంగళవారం బహిరంగ సభ (ప్రజావేదిక) నిర్వహించారు. 024 ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి 2025 మార్చి 31 వరకు మండలం పరిధిలో 1125 పనులను రూ.9,40,60,750 ఉపాధి నిధులతో చేపట్టిన పనులపై సామాజిక తనిఖీ బృందం ఇటీవల క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించింది. ఈ పనుల్లో అనేక నిర్వహణ లోపాలు ఉన్నట్లు డ్వామా పీడీ సిద్ధలింగమూర్తి వెల్లడించారు. ఎంపీపీ పిడతల ఝాన్సీసాగర్‌ అధ్యక్షతన జరిగిన ఈ సభలో ఎంపీడీవో వి.హేమలతాదేవి, ఏపీడీ హీరాలాల్‌, ఏపీవో విజయకుమారి, ఏపీవో డి.సుందర్రావు, టీఏ మాధవి, ఎస్‌ఆర్‌పీ బి.ఆవులయ్య పాల్గొన్నారు. పీడీ వెల్లడించిన వివరాల ప్రకారం జంగిల్‌ క్లియరెన్స్‌ పనులకు సంబంధించి సరైన ఆధారాలు లేకుండానే బిల్లులు తీసుకున్నట్లు గుర్తించామన్నారు. అలాగే శ్రామికుల మస్టర్లు అసంపూర్ణంగా ఉన్నాయన్నారు. పంటకాల్వల పూడిక తీతల పనుల్లోనూ అవకతవకలు ఉన్నట్లు తేలిందన్నారు. పనుల ప్రదేశాల్లో నేమ్‌బోర్డుల ఏర్పాటు చేయని విషయాలు వెలుగు చూశాయన్నారు. ముఖ్యంగా పంచాయతీరాజ్‌ పను లు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయన్నారు. 5 శాతం రాయితీ జీవోను చూపకుండా 20 శాతం చెల్లింపులు చేయడం వంటి విషయాలు బయటపడ్డాయన్నారు. గత 16వ విడతలో రూ.1.73 లక్షల రికవరిలో ఇంకా రూ.63,390 బకాయి ఉందన్నారు. దీనిని వెంటనే రికవరీ చేయాలని ఎంపీడీవోను ఆదేశించారు.

వైఎస్సార్‌ సీపీ ‘పశ్చిమ’

సమన్వయకర్తగా అంబటి

పట్నంబజారు (గుంటూరుఈస్ట్‌) : వైఎస్సార్‌ సీపీ అధ్యక్షులు వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్తగా అంబటి రాంబాబు నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి మంగళవారం ఉత్తర్వులు అందాయి. ఇప్పటికే అంబటి జిల్లా అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 2019 ఎన్నికల్లో వై.ఎస్‌.జగన్‌ సత్తెనపల్లి సీటు ఇవ్వడంతో ఆయన అక్కడ విజయం సాధించారు. కేబినెట్‌లో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రిగా అంబటి బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తరువాత జిల్లా అధ్యక్షులుగా నియమితులైనప్పటి నుంచి అధిష్టానం పిలుపు మేరకు నిర్వహించిన కార్యక్రమాల్లో తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు.

ఖతార్‌లో ఉద్యోగావకాశాలు

గుంటూరు వెస్ట్‌/ఎడ్యుకేషన్‌: ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఖతార్‌ దేశంలో టీఐసీ అండ్‌ ఏ, ఆర్‌సీ మల్టీ వెల్డర్‌ సర్వీసుల కింద ఉద్యోగం చేయాలనుకునే పురుష అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశాలను కల్పిస్తోందని గుంటూరు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి కొండా సంజీవరావు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఐటీఐ, ఐటీసీ విద్యార్హతలతో 24 నుంచి 45 ఏళ్ల మధ్య వయసు, సంబంధిత వృత్తి నైపుణ్యంలో నాలుగేళ్ల కనీస అనుభవం ఉండాలని తెలిపారు. టీఐజీ అండ్‌ ఏఆర్‌సీ మల్టీ వెల్డర్‌కు వేతనం నెలకు రూ.51,939 నుంచి, టీఐజీ అండ్‌ ఏఆర్‌సీ వెల్డర్‌కు రూ.42,478 నుంచి ఉంటుందని వివరించారు. కనీసం రెండేళ్లు అక్కడ పనిచేయాల్సి ఉంటుందనానరు. సాంకేతిక పరిజ్ఞానం నైపుణ్యాల ఆధారంగా ఎంపిక ఉంటుందని పేర్కొన్నారు. ఉచిత వసతి, భోజన, వైద్య, రవాణా సదుపాయాలతో కూడిన ఈ ఉద్యోగావకాశాల కోసం అభ్యర్థులు ఈ నెల 25లోపు 99888 53335, 87126 55686 ఫోను నంబర్లలో సంప్రదించాలని తెలిపారు.

ఉపాధి పనుల్లో లోపాలు 1
1/1

ఉపాధి పనుల్లో లోపాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement