సమ్మెలోకి అవుట్‌ సోర్సింగ్‌ కార్మికులు | - | Sakshi
Sakshi News home page

సమ్మెలోకి అవుట్‌ సోర్సింగ్‌ కార్మికులు

Jun 24 2025 4:27 AM | Updated on Jun 24 2025 4:27 AM

సమ్మెలోకి అవుట్‌ సోర్సింగ్‌ కార్మికులు

సమ్మెలోకి అవుట్‌ సోర్సింగ్‌ కార్మికులు

నెహ్రూనగర్‌: రాష్ట్ర వ్యాప్తంగా నగరపాలక సంస్థల్లో పనిచేస్తున్న ఇంజినీరింగ్‌ విభాగ అవుట్‌ సోర్సింగ్‌ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం ఆదివారం రాత్రి నుంచి సమ్మెలోకి వెళ్లారు. నగరపాలక సంస్థ కార్యాలయం ముందు సోమవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఐక్య కార్యాచరణ కమిటీ చైర్మన్‌ ఈదులమూడి మధుబాబు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్‌ ఇంజినీరింగ్‌ విభాగం కార్మికులు, కార్మిక సంఘాలు ఐక్య కార్యాచరణ కమిటీగా ఏర్పడి ఈనెల 9న కమిషనర్‌కు సమ్మె నోటీస్‌ ఇచ్చినా స్పందించలేదని విమర్శించారు. కార్మికులకు జీతాలు పెంచమని పలుమార్లు వినతి పత్రాలు ఇచ్చినా పట్టించుకోలేదని తెలిపారు. విధి లేని పరిస్థితుల్లో సమ్మె చేస్తున్నట్లు మధుబాబు తెలిపారు. గత ప్రభుత్వం పారిశుద్ధ్యం, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ కార్మికులకు, డ్రైవర్లకు అప్పుడున్న జీతంపై రూ.6000 అదనంగా పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చిందని పేర్కొన్నారు. ఇంజినీరింగ్‌ విభాగంలో పనులు చేసే కార్మికులకు కమిటీ వేసి దాని సిఫార్సు మేరకు జీతాలు పెంచుతామని హామీ ఇచ్చిందని తెలిపారు. ఈనెల రెండో తేదీన జరిగిన జాయింట్‌ మీటింగ్‌లో ఈ విషయాన్ని మంత్రి నారాయణ దృష్టికి తీసుకెళ్లగా ముఖ్యమంత్రితో మాట్లాడి చెప్తామని చెప్పి, ఇంతవరకు స్పష్టత ఇవ్వలేదని వివరించారు. రిటైర్‌మెంటు వయసును 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచాలని, ఉద్యోగ విరమణ చేసిన కార్మికులకు వెంటనే గ్రాట్యుటీ చెల్లించాలని డిమాండ్‌ చేశారు. యూనియన్‌ గుంటూరు నగరపాలక సంస్థ కమిటీ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement