
సమస్యల పరిష్కారానికి చర్యలు
● జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ● పోలీసు పీజీఆర్‌ఎస్‌కు 75 ఫిర్యాదులు
నరసరావుపేట: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) ద్వారా వచ్చిన ఫిర్యాదుల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు పేర్కొన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో పీజీఆర్‌ఎస్‌కు అధ్యక్షత వహించి ప్రజల నుంచి కుటుంబ, ఆర్థిక, ఆస్తి తగాదాలు, మోసం, చోరీలు తదితర సమస్యలకు సంబంధించిన 75 ఫిర్యాదులు స్వీకరించారు. ప్రతి ఫిర్యాదుదారుని సమస్యను శ్రద్ధగా విని, నిర్ణీత గడువులోగా ఫిర్యాదులను పరిష్కరించడానికి కృషిచేయాలని అధికారులను ఆదేశించారు.
పొలాన్ని ఆక్రమించారు
కోనూరు ఇసుక రీచ్‌లో అక్రమంగా ఇసుక తోడుతుంటే నేను ఆర్డీఓ, కలెక్టర్‌లకు ఫిర్యాదు చేశాను. ఈ పనిచేశానని ఎమ్మెల్యే అనుచరులు నాపై కక్ష కట్టి, నా మూడెకరాల పొలాన్ని ట్రాక్టర్‌తో దున్నారు. కౌలు రైతులను బెదిరిస్తున్నారు. వెంటనే వారిపై చర్యలు తీసుకొని నాకు న్యాయం చేయండి.
–శాఖమూరి శ్రీనివాసరావు,
కోనూరు, అచ్చంపేట