
● సమీక్షలో ఆదేశించిన జిల్లా కలెక్టర్ ● యోగా స్ట్రీట్‌ల
యోగా ఔత్సాహిక రిజిస్ట్రేషన్లు వేగవంతం చేయండి
నరసరావుపేట: జిల్లాలో యోగాంధ్ర యాప్ ద్వారా యోగా ఔత్సాహిక రిజిస్ట్రేషన్లు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు అధికారులను ఆదేశించారు. మంగళవారం యోగాంధ్రపై జిల్లా కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో ఎనిమిది లక్షల మందిని యోగా ఔత్సాహికులను నమోదు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకోగా ఇప్పటి వరకూ లక్ష మంది నమోదు పూర్తయిందన్నారు. వీరితోపాటూ 4,800 వరకూ మాస్టర్ ట్రైనర్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. రేపు ఉదయం 8.00 గంటలలోగా గ్రామ స్థాయిలో యోగా పోటీలు నిర్వహించి విజేతల వివరాలు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలన్నారు. గ్రామ స్థాయిలో విజేతలకు జూన్ రెండు నుంచి మండల స్థాయి పోటీలు నిర్వహిస్తామన్నారు.
యోగా స్ట్రీట్‌గా కలెక్టర్ క్యాంపు
కార్యాలయ రోడ్డు
యోగాంధ్ర మాసోత్సవ వేడుకలలో భాగంగా స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయం రోడ్డుకు యోగా స్ట్రీట్ గా నామకరణం చేస్తున్నామని జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు వెల్లడించారు. జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం వరకూ ప్రతి రోజూ ఉదయం వివిధ శాఖల ఆధ్వర్యంలో యోగా స్ట్రీట్ నందు యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. మంగళవారం ఉదయం మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో సామూహిక యోగా నిర్వహించడం జరిగిందన్నారు.