
పోగొట్టుకున్న నగదు అప్పగింత
పర్చూరు(చినగజాం): స్థానిక అమ్మ టిఫిన్ సెంటర్‌లో టిఫిన్ చేసేందుకు వచ్చి క్యాష్ బ్యాగును మరచిపోయి వెళ్లిపోయిన వ్యక్తికి అదే దుకాణంలో పని చేస్తున్న వ్యక్తి ఆ నగదు తిరిగి అప్పగించాడు. ఈ ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. పొన్నూరు గ్రామానికి చెందిన డొక్కు సీతారామరాజు మొక్కజొన్న ట్రేడింగ్‌కు సంబంధించిన రూ 1.80 లక్షల నగదు ఉన్న బ్యాగు దుకాణంలో మరచి పోయి వెళ్లిపోయాడు. అమ్మ టిఫిన్ సెంటర్‌లో వర్కర్‌గా పనిచేస్తున్న ఆలపాటి ప్రసాద్ సీతారామరాజు బ్యాగును గుర్తించి స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐ మాల్యాద్రికి అప్పగించాడు. సీతారామరాజుకు విషయం తెలియజేసి , స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐ సమక్షంలో అతని క్యాష్ బ్యాగును అప్పగించారు. టిఫిన్ సెంటర్ వర్కర్ ప్రసాద్ నిజాయితీని పలువురు అభినందించారు.