
వైఎస్సార్ సీపీ హయాంలో శరవేగంగా పనులు..
కాకానిలోని జేఎన్‌టీయూఎన్ ఇంజినీరింగ్ కళాశాలలో అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ కాలంలో శరవేగంగా సాగిన పనులు గత పదినెలలుగా ముందుకు సాగడం లేదు. కళాశాలలో దాదాపు రూ.150 కోట్లతో వివిధ అభివృద్ధి పనులను గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చేపట్టింది. అకడమిక్ బ్లాక్, అడ్మినిస్ట్రేషన్ బ్లాక్‌లతో పాటు అంతర్గత రోడ్ల నిర్మాణాలు పూర్తిచేసారు. దీంతో పాటు అంతర్జాతీయ ప్రమాణాలతో స్పోర్ట్స్ కాంప్లెక్స్, యువతీ, యువకులకు వసతి గృహాల నిర్మాణాలు ప్రారంభించింది. ఈ రెండు నిర్మాణ పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి.