
కీటక జనిత వ్యాధులపై అప్రమత్తత అవసరం
డీఎంహెచ్‌ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి
గుంటూరు మెడికల్: వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో దోమలు వృద్ధి చెంది వ్యాధులు వ్యాప్తి చెందకుండా అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి సూచించారు. డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో సోమవారం మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్, అసిస్టెంట్ మలేరియా ఆఫీసర్లతో కీటక జనిత వ్యాధుల నివారణపై సమావేశం జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ దోమలు వృద్ధి చెందకుండా యాంటీ లార్వా మెజర్స్ అమలు చేయాలన్నారు. అడల్డ్ మస్కిటో మెజర్స్‌పై అప్రమత్తంగా ఉండాలన్నారు. డెంగీ, మలేరియా వంటి దోమ కాటు వ్యాధులను గణనీయంగా తగ్గించేలా ప్రణాళికాబద్ధంగా పనిచేయాలన్నారు. పరిసరాల పరిశుభ్రత వల్ల దోమలు దరిచేరవని, ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించడంతోపాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకునేలా అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి సుబ్బరాయణం, అసిస్టెంట్ మలేరియా అధికారి రాజునాయక్, ఏఎంఓ ప్రభాకర్‌రెడ్డి, ఘంటసాల శ్రీనివాసరావు, నరేంద్రబాబు, ప్రశాంత్, సబ్ యూనిట్ ఆఫీసర్లు శేషగిరిరాజు, శ్రీమన్నారాయణ, శిగణేష్ పాల్గొన్నారు.